Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే సంచలన వీడియో.. వైసీపీ కౌంటర్ అటాక్

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అసభ్యకరంగా వ్యవహరిస్తున్న వీడియోను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

By:  Tupaki Desk   |   4 Aug 2025 1:41 PM IST
టీడీపీ ఎమ్మెల్యే సంచలన వీడియో.. వైసీపీ కౌంటర్ అటాక్
X

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. లిక్కర్ స్కాంతోపాటు ఇతర విషాయాల్లో టార్గెట్ చేస్తున్న ప్రభుత్వంపై వైసీపీ కౌంటర్ అటాక్ దిగుతోంది. ముఖ్యంగా మద్యం కమీషన్ డబ్బులతో నిందితుడు వెంకటేశ్ నాయుడు ఉన్న వీడియోను ప్రభుత్వం రెండు రోజుల క్రితం బయటపెట్టింది. దీంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బతీసినట్లైంది. అయితే ప్రభుత్వం చేస్తున్న రాజకీయ దాడి నుంచి తప్పించుకునేలా వైసీపీకి ఓ అస్త్రం దొరికింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు అదే పార్టీకి చెందిన మహిళా నేత పట్ల తో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఉన్న వీడియోను వైసీపీ బయట పెట్టింది. దీంతో అధికార పార్టీకి షాక్ తగినట్లైందని అంటున్నారు.

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కి సంబందించిన వీడియోను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఎమ్మెల్యే రాసలీలలు బయటపడ్డాయని చెబుతూ ‘‘గతంలో టీడీపీ కార్పొరేటర్‌ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి అసభ్యకరంగా సైగలు చేస్తూ మాట్లాడిన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ’’ పేరుతో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇదేనా చంద్రబాబు కామ పార్టీ సిత్రాలు అంటూ ప్రశ్నించింది.

బాధితురాలు ట్రైన్‌లో వెళ్తుండగా.. ఎమ్మెల్యే తన ఆఫీస్‌లో నుంచి కాల్ చేసి అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించారని వైసీపీ ట్వీట్ చేసింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రవర్తన పై మండిపడుతున్నాయని, వెంటనే నజీర్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసిన వైసీపీ.. టీడీపీ ఎమ్మెల్యేలకు మీరు నేర్పిన సంస్కారం ఇదేనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను ట్యాగ్ చేసింది. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వీడియోపై అధికార పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదు. బాధితురాలు నుంచి కూడా ఈ వ్యవహారంపై ఏ ప్రకటన రాలేదని అంటున్నారు. వైసీపీకి ఈ వీడియో ఎలా లభించిందనేది సస్పెన్స్ గా మారింది. ఇది నిజామా లేదా డీప్ ఫేక్ వీడియో నా అనేది నిపుణులు తేల్చాలిసి ఉంది.