ఇంకా సజ్జలేనా.. మాకేంటీ తలనొప్పి .. !
తాజాగా జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటించాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు.
By: Tupaki Desk | 31 May 2025 11:51 PM ISTవైసీపీ కీలక నాయకుడు, జగన్ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికే దాదాపు అన్ని విషయాల్లోనూ అగ్రతాంబూ లం దక్కుతోంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా పార్టీ వ్యవహారాలను సజ్జలే చక్కబెడు తున్నారు. అయితే.. దీనివల్లే అసలు సమస్యలు వస్తున్నాయని పార్టీ నాయకులు అనేక పర్యాయాలు వెల్లడించారు. కొందరు బహిరంగంగా కూడా వ్యాఖ్యానించారు. అయినా.. జగన్‌లో మార్పు రావడం లేదు. ఆయన తీరు.. పార్టీ నడత కూడా మారడం లేదు. దీంతో సమస్య సజావుగానే కొనసాగుతోందని పార్టీలోనే నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
తాజాగా జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటించాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. పార్టీలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా నిర్దేశం చేశారు. ప్రభుత్వంలో మారి జూన్ 4కు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో జగన్ ఈ నిరసనలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడానెరవేర్చలేదన్నది జగన్ అభిప్రా యం. దీనిపైనే ఆయన పోరాటం ప్రారంభించారు. అయితే.. ఈ వ్యవహారం ఆదిలోనే పార్టీలో ఇబ్బందులు సృష్టిస్తోంది. ఎందుకంటే.. ఈ విషయంలోనూ సీనియర్లను పక్కన పెట్టి.. జగన్.. సజ్జలకే ప్రాధాన్యం ఇచ్చారు.
శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినానికి సంబంధించిన ఒక పోస్టర్‌ను ఆవిష్కరించారు. అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఒకటికి నాలుగు సార్లు ప్రజల మధ్య పోటీ చేసి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయితే.. వీరందరినీ పక్కన పెట్టి.. ఈ పోస్టర్‌ను సజ్జల రామకృష్నారెడ్డి ఆవిష్కరించారు. అంతేకాదు.. ఆయనే సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇతర నాయకులకు, సీనియర్లకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ వ్యవహారంపై పార్టీలో విమర్శలు వస్తున్నాయి.
వద్దని చెబుతున్న సజ్జలకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఆయనవల్లే పార్టీ నాశనం అయిందని అనంతపురం జిల్లాకు చెందిన కొందరు నాయకులు అంతర్గత చర్చల్లో బాహాటంగానే వ్యాఖ్యానించారు. మరికొందరు అసలు ఇప్పుడు ఆయనకు ఏ అర్హత ఉందని ఇలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేవలం తెచ్చుకున్న కో ఆర్డినేటర్ అనే పదవి తప్ప.. ఇంకా ఆయన ఎందుకు పెత్త నం చేయాలని ప్రశ్నించారు. అయితే.. ఇంతగా ప్రశ్నిస్తున్నవారు కూడా.. ఎవరూ బాహాటంగా ఆయనను ప్రశ్నించడం లేదు. పైగా.. జగన్ అంటే తమకు భక్తి అని చెబుతున్నారు. దీంతో వారంతా జగన్ నిర్ణయం కోసమైనా.. సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ, ఇలానే సాగితే.. ఇబ్బందేనన్నది మెజారిటీ నాయకుల మాటగా వినిపిస్తోంది.
