మాపై అక్రమ కేసులు.. : సజ్జల, అంబటి
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తున్నట్టు వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్.. గత ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 9 Jun 2025 3:39 PM ISTసీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తున్నట్టు వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్.. గత ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణలు పెరిగిపోయాయని చెప్పారు. ఇలా చేస్తే.. రాష్ట్రంలో సామాన్యులకు పోలీసింగ్ అందుబాటులో ఉంటుందా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. రాష్ట్రం కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని.. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిం ది ఏమీ లేదన్నారు. ఈ విషయం ఇప్పుడు చర్చకు వస్తోందన్న కారణంగానే.. దీని నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు ఇప్పుడు తప్పుడు కేసులతో కొమ్మినేనిని అరెస్టు చేశారని సజ్జల చెప్పారు. అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే.. రేపు ప్రభుత్వం మారిన తర్వాత.. కూడా అదే విధానం జరుగుతుందన్నారు. ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను ఎంచుకుంటోందని ఆరోపించారు.
వారు బూతులు మాట్లాడారు!
ఇక, వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ఇతర చానెళ్లలో వైసీపీ నాయకుల పై బూతులు తిడుతున్నారని.. కానీ, వారిపై చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీలో ఉన్న వారిపై తీవ్ర దూషణలకు దిగుతున్నారని అన్నారు. సాక్షి ఛానెల్‌లో ఏమీ జరగకపోయినా.. ఆఘమేఘాల పై అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చారని.. ఇది ప్రజలకు మంచి కాద న్నారు. వ్యవస్థీకృతంగా జరుగుతున్న వేధింపులేనని పేర్కొన్నారు.
ముందుగా నారా లోకేష్, తర్వాత సీఎం చంద్రబాబు, ఆ తర్వాత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేస్తారని.. అనంతరం.. అరెస్టు చేస్తున్నారని అంబటి చెప్పారు. దీనికి మించిన సమస్య రాష్ట్రంలో ఇతర సమస్యలు లేవన్నట్టుగా కృతిమ సృష్టి చేశారని తెలిపారు. గతంలో కూడా.. సాక్షిని ఆపేసేందుకు ప్రయ త్నించారని.. అయినా.. పట్టుదలతో మీడియా సంస్థ కొనసాగుతోందన్నారు. అనేక చానెళ్లలో బూతులు తిట్టుకుంటున్నారని.. డిబేట్లలో చెప్పులతో కొట్టుకుంటున్నారని.. వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
