Begin typing your search above and press return to search.

వైసీపీ 'స్థితి' మంతం అయ్యేనా ..!

ఎన్నిక‌ల్లో గెలుపు-ఓట‌ములు స‌హ‌జం. ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క భావోద్వేగాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. దేశంలో ఎన్నిక‌లు చూస్తే.. భావోద్వేగం కంటే కూడా.. స‌మ‌కాలీన అంశాలు ప్ర‌భావితం చూపుతున్నాయి.

By:  Tupaki Desk   |   12 Jun 2025 5:00 PM IST
వైసీపీ స్థితి మంతం అయ్యేనా ..!
X

ఎన్నిక‌ల్లో గెలుపు-ఓట‌ములు స‌హ‌జం. ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క భావోద్వేగాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. దేశంలో ఎన్నిక‌లు చూస్తే.. భావోద్వేగం కంటే కూడా.. స‌మ‌కాలీన అంశాలు ప్ర‌భావితం చూపుతున్నాయి. మ‌తం-కులం క‌న్నా.. ఒక్కొక్క‌సారి అభివృద్దిమంత్రం ప‌నిచేస్తుంది. ఇదేస‌మ‌యంలో ఒక్కొక్క‌సారి నాయకుల తీరు కూడా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. దీంతో ఎన్నిక‌ల స‌ర‌ళితోపాటు ఫ‌లితం కూడా అనూహ్యంగా మారుతుంది. దీనిని అంచ‌నా వేయ‌డ‌మే రాజ‌కీయ నాయ‌కులు, పార్టీల ల‌క్ష్యం.

అయితే.. ఈ విష‌యంలో వైసీపీ ప‌డిక‌ట్టుగా ముందుకు సాగింది. 2019లోను, 2024లోనూ.. వైసీపీ కేవ‌లం సెంటిమెంటు, సంక్షేమాన్ని న‌మ్ముకుని ముందుకు సాగింది. ఒక్క ఛాన్స్ అన్నా.. న‌వ‌ర‌త్నాలు అన్నా.. ఇవి రెండు కూడా.. సెంటిమెంటు, సంక్షేమాన్ని చుట్టుకుని ప్ర‌జ‌ల చుట్టూ తిరిగాయి. అయితే.. సెంటిమెం టు, సంక్షేమం అనేవి ఎప్పుడూ ఎవ‌రి సొత్తూ కావు. నాడు జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉన్న ఈ రెండు అంశాలు.. గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మికి అనుకూలంగా మారాయి.

కానీ, అస‌లు విష‌యం వేరే ఉంటుంది. అదే `స్థితి మంతం!`. ఇది మ‌న‌కు ప్ర‌ధాని మోడీలో స్ప‌ష్టంగా క‌ని పిస్తుంది. తాను ఒక్క సారి అధికారంలోకివ‌స్తే.. ఇక ఆ సీటును కోల్పోకుండా.. చూసుకోవ‌డంలో నే నాయ కుడి స్థితి మంతం క‌నిపిస్తుంది. ఇది.. మోడీలో ఉంది. అందుకే.. ఆయ‌న గుజ‌రాత్‌లోను.. ఇప్పుడు కేంద్రంలోనూ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఆయ‌న‌కు మాత్రం ఆటుపోట్లు లేవా? విమ‌ర్శ‌లు రావా? క‌క్ష‌సాధింపు రాజ‌కీయాలు లేవా? అంటే.. ఉన్నాయి.

కానీ.. ఎప్ప‌టికి ఏది అవ‌స‌ర‌మో.. అప్ప‌టికి అది చేయ‌డంలోనే నాయ‌కుడి స్థితి మంతం క‌నిపిస్తుంది. ఇప్పుడు చంద్ర‌బాబు ను చూస్తే.. అదే క‌నిపిస్తోంది. అయితే.. దీనికి మ‌రింత మెరుగులు దిద్దాల్సిన అవ స‌రం ఉంది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే..ఈ స్థితి మంతం మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. ఏ విష‌యాన్ని ఎలా వాడుకోవాలి? ఎప్పుడు ఎలా స్పందించాల‌న్న విష‌యంలో వైసీపీ త‌డ‌బాటు ఇప్ప‌టికీ స్ప‌ష్టంగానే ఉంది. అధికారం అంటే.. అద్దాల మేట‌.. అంటారు మ‌హాక‌వి శ్రీశ్రీ. దీనిని కాపాడుకోవాలంటే.. స్థితిమంతం కావాలంటే.. ఆదిశ‌గా జ‌గ‌న్‌, వైసీపీలు చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది.