యనమలకు స్వీట్ న్యూస్ బాబు చెబుతున్నారా ?
తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి యనమల రామక్రిష్ణుడు ఆ పార్టీలో ఉన్నారు. 1983లోనే ఆయన గెలిచి వచ్చారు.
By: Satya P | 20 March 2026 5:00 AM ISTతెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి యనమల రామక్రిష్ణుడు ఆ పార్టీలో ఉన్నారు. 1983లోనే ఆయన గెలిచి వచ్చారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలోనే కీలక మంత్రి పదవులు నిర్వహించారు. ఇక చంద్రబాబు హయాంలో స్పీకర్ గానే కాకుండా ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేస్తూ ఎన్నో బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. పన్నెండేళ్ళ పాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే యనమల చిరకాల కోరిక రాజ్యసభకు వెళ్లాలని. అక్కడ తన వాణిని వినిపించాలని. ఆ కోరిక ఆయనకు గడచిన పుష్కర కాలంగా ఉంది. కానీ తగిన అవకాశం అయితే రావడం లేదు. ఇపుడు ఆ ముహూర్తం దగ్గర పడిందా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవుననే అంటున్నారు.
ఆ కోటాలో ఆయనే :
ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు జూన్ లో ఖాళీ అవుతున్నాయి. అందులో రెండు కచ్చితంగా టీడీపీకి దక్కనున్నాయి. వాటిలో ఒక దానిని సీనియర్లకు ఇవ్వాలని పార్టీ చూస్తోంది అని అంటున్నారు. అలాగే బీసీలకు పెద్ద పీట వేయాలని పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఈ విద్ధంగా చూస్తే ఈ రెండు కొలమానాలకు సరైన వ్యక్తిగా యనమల ఉన్నారని అంటున్నారు. ఆయన గత ఏడాది మార్చి 30తో ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో పెద్దాయనగా ఆయనకు సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలీ అంటే కచ్చితంగా రాజ్యసభకు పంపడం శ్రేయస్కరం అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.
ఆ ఎఫెక్ట్ పడదని అంటూ :
ఇదిలా ఉంటే యనమల అల్లుడు ఏలూరు ఎంపీగా ఉన్న పుట్టా మహేష్ ఇటీవల హైదరబాద్ లో జరిగిన డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. అది పెద్ద రచ్చగా మారింది. అయితే ఆ ఎఫెక్ట్ తో యనమల అవకాశాలు పోతాయని ప్రచారం సాగుతోంది కానీ అలాంటిది ఏమీ లేదని అంటున్నారు. యనమల టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉన్న వారు అని నిబద్ధతతో పార్టీకి సేవ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే యనమల మీద ఆ ప్రభావం ఏ విధంగానూ పడదని చెబుతున్నారు. యనమల వంటి పెద్దల సలహా సూచనలు రాజ్యసభలో అవసరమని పార్టీకి కూడా ఆయన క్రియాశీలకంగా ఉండడం ఈ సమయంలో అవసరం అని అంటున్నారు. దాంతోనే యనమల పేరుని సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు.
బాబుకు సన్నిహితుడుగా :
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా యనమల ఉంటున్నారు అన్నది తెలిసిందే. అంతే కాదు ఆంతరంగికుడిగా మెలుగుతారు అని చెబుతారు. ఇద్దరూ సమ వయస్కులు. ఇద్దరూ రాజకీయంగా కలసి మెలసి ఉంటూ టీడీపీలో కీలక దశకు చేరుకున్న వారు అని అంటారు. దాంతో చంద్రబాబు తన మిత్రులకు సీనియర్లకు తగిన విధంగా న్యాయం చేయడమే కాదు, గౌరవనీయమైన స్థానం కల్పించే విషయంలో ఆలోచిస్తూ ఉంటారని అంటారు. గత ఏడాది మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకి గోవా గవర్నర్ గా నియామకం జరిగింది. ఆ విధంగా బాబు ఆయన రుణం తీర్చుకున్నారని అంటున్నారు. ఇపుడు మరో సీనియర్ నేతగా యనమల వంతు వచ్చిందని అందుకే రాజ్యసభ సీటు ఆయన కోసం రిజర్వ్ అయింది అని చెబుతున్నారు. ఈ గుడ్ న్యూస్ ని బాబు తొందరలోనే యనమలకు వినిపిస్తారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. మొత్తానికి యనమల పెద్దల సభలోకి అడుగు పెట్టాలన్న కోరిక మరో రెండు నెలలలో తీరిపోతుంది అని అంటున్నారు.
