Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ కు జాన్ సీనా... వివరాలివే!

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, హాలీవుడ్ హీరో జాన్ సీనా ఇండియాకు వస్తున్నారు. అందులోనూ... ఏకంగా హైదరాబాద్ కే వస్తున్నారు

By:  Tupaki Desk   |   23 Aug 2023 8:11 AM GMT
హైదరాబాద్‌ కు జాన్ సీనా... వివరాలివే!
X

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, హాలీవుడ్ హీరో జాన్ సీనా ఇండియాకు వస్తున్నారు. అందులోనూ... ఏకంగా హైదరాబాద్ కే వస్తున్నారు. జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ షోలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు వస్తున్నారు.

అవును... జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నట్లు స్వయంగా జాన్ సేనా ప్రకటించారు. ఇందులో భాగంగా... "సీ యూ ఆల్ వెరీ సూన్" అంటూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

కాగా... 2017లో భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ అనంతరం మళ్లీ భారత్‌ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. ఆ ఈవెంట్ కు హైదరబాద్ వేదిక కానుంది. ఈ సూపర్ స్పెక్టేకిల్‌ లో తను కూడా పాల్గొంటున్నట్లు జాన్ సీనా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించాడు.

ఇందులో భాగంగా... మరోసారి ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యామిలీని కలిసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానంటూ జాన్ సీనా పోస్టు చేశాడు. "స్మాక్‌ డౌన్‌ లో డబ్ల్యూడబ్ల్యూఈ కుటుంబంతో కలిసేందుకు ఆగలేకపోతున్నా. మరీ ముఖ్యంగా భారత్‌ లోని డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్‌ ను కలిసేందుకు చాలా ఎగ్జయిట్ అవుతున్నా. త్వరలోనే అందర్నీ కలుస్తా" అని జాన్ సీనా పోస్ట్ చేశాడు.

అయితే గతంలో ఒకసారి భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొనే భారతీయ సూపర్ స్టార్లతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలని డబ్ల్యూడబ్ల్యూఈ భావించిందట. అయితే నాడు అది కార్యరూపం దాల్చలేదు. దీంతో... ఈ షో సూపర్ స్టార్ "గ్రేట్ ఖాలి"తో ఒక ప్రమోషనల్ ప్రోగ్రాం మాత్రం నిర్వహించారు.

అయితే ఈ సారి అలా కాదు... ఈసారి పూర్తి స్థాయిలో ఈ వెంట్ జరగబోతుందని... ఈ ఈవెంట్ కు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా కూడా భారత్‌ కు వస్తున్నాడని తెలుస్తోంది. దీంతో... ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారని అంటున్నారు.

కాగా... సెప్టెంబర్ 8వ తేదీన హైదరాబాద్ నగరంలో సూపర్ స్టార్ స్పెక్ట్రాకిల్ జరగనుంది. దీనికోసం వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ లెజెండ్ జాన్ సీనా దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇండియాకు రాబోతున్నాడు. 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయినా జాన్ సీనా కు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.