Begin typing your search above and press return to search.

సెకనులో నగరం నాశనం.. గాల్లో ఎగిరేపోయే కార్లు..అత్యంత ప్రమాదకరమైన తుఫానులు వచ్చేది ఇక్కడే!

ప్రపంచంలో ప్రతి సంవత్సరం అనేక శక్తివంతమైన తుఫానులు వస్తుంటాయి. వాటి వేగం వింటే ఎవరికైనా గుండెల్లో కొన్ని సార్లు దడ పుడుతుంది.

By:  Tupaki Desk   |   4 May 2025 12:15 AM IST
World’s Deadliest Storms
X

మీ జీవితంలో ఎప్పుడైనా ఓ భయంకరమైన తుఫానును చూశారా.. దాని వేగానికి కార్లు ఎగిరిపోవడం చూశారా.. దాని వల్ల కలిగే నష్టానికి వార్తల్లో చూసి ఆశ్చర్యపోయి ఉంటాం. ప్రపంచంలో ప్రతి సంవత్సరం అనేక శక్తివంతమైన తుఫానులు వస్తుంటాయి. వాటి వేగం వింటే ఎవరికైనా గుండెల్లో కొన్ని సార్లు దడ పుడుతుంది. అంత వేగంతో నిజంగానే గాలులు వీస్తాయా అని ఆశ్చర్యపోతుంటాం. కొన్ని తుఫానులు అయితే ఊహించని విధ్వంసం సృష్టిస్తాయి.

బంగ్లాదేశ్‌లో వచ్చిన గ్రేట్ భోలా సైక్లోన్ దాదాపు 5 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. అలాగే 2015లో తూర్పు పసిఫిక్ ప్రాంతంలో గంటకు 215 మైళ్ల వేగంతో ఒక భయంకరమైన తుఫాను నమోదైంది. మన భూమిపై కొన్ని ప్రాంతాలలో వచ్చే తుఫానులు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి ఇళ్లనుండి కార్ల వరకు కాగితాల మాదిరిగా ఎగరవేసుకుపోతుంటాయి. అలాంటి కొన్ని భయంకరమైన తుఫానుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాలోని బారో ద్వీపంలో ఎప్పుడూ తుఫాను గాలులు వీస్తూనే ఉంటాయి. 1996 ఏప్రిల్ 10న ఇక్కడ ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ సమయంలో గంటకు 408 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అలాగే జపాన్‌లో 1961లో వచ్చిన నాన్సీ తుఫాను కూడా చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించారు. దాని వేగం గంటకు 346 కిలోమీటర్లు.

అమెరికాలోని ఒక్లహోమాలో కూడా తరచుగా భయంకరమైన టోర్నడోలు వస్తుంటాయి. 1999 మే 3న బ్రిడ్జ్ క్రీక్ దగ్గర వచ్చిన టోర్నడో గంటకు 302 మైళ్ల వేగంతో వీచింది. దక్షిణ సముద్రంలో కూడా నిరంతరం తుఫానులు వస్తుంటాయి. అక్కడ గాలి వేగం గంటకు 100 నుంచి 160 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే అంటార్కిటికాలో కూడా అనేక మంచు తుఫానులు వస్తుంటాయి. 1913 మే 6న ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన మంచు తుఫాను వచ్చింది. అప్పుడు గాలి వేగం గంటకు 153 కిలోమీటర్లుగా నమోదైంది.