Begin typing your search above and press return to search.

సంగీతం టీచర్‌ గా పని చేస్తూ డ్రగ్స్ దందా... తెరపైకి టాలీవుడ్ లింక్స్!

ఈ సమయంలో నిందితురాలు లావణ్యను విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 11:29 AM GMT
సంగీతం టీచర్‌  గా పని చేస్తూ డ్రగ్స్  దందా... తెరపైకి టాలీవుడ్  లింక్స్!
X

హైదరాబాద్‌ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ దందాలు, వాడకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో ప్రియురాలు డ్రగ్స్ తో నార్సింగ్ లో పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ సమయంలో నిందితురాలు లావణ్యను విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయని అంటున్నారు.

అవును... హైదరాబాద్ సిటీ అవుట్ కట్స్ నార్సింగిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో నిందితురాలు లావణ్య (34) నుంచి పోలీసులు పలు వివరాలను సేకరించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. విజయవాడకు చెందిన లావణ్య ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చిందని.. ఇక్కడ సంగీతం టీచర్‌ గా పని చేస్తూ, షాట్ ఫిలిమ్స్ లోనూ నటించేవారని చెబుతున్నారు.

ఈ సమయంలోనే జల్సాలకు అలవాటుపడటం.. పలువురి పరిచయాలతో డ్రగ్స్‌ దందా మొదలు పెట్టారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కోకాపేటలో నివాసముంటున్న లావణ్య డ్రగ్స్‌ దందా చేస్తున్నట్లు మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందడంతో.. పోలీసులు ఆమెను శంకర్‌ పల్లి - నార్సింగి రహదారిలో అదుపులోకి తీసుకున్నారు.

ఆమెను అదుపులోకి తీసుకున్న అనంతరం చేసిన తనిఖీల్లో 4 గ్రాముల ఎండీఎంఏ లభించిందని.. ఆమె కొన్నిరోజులుగా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారని తెలుస్తుంది. అయితే... పరిచయస్థుడైన ఉనీత్‌ రెడ్డి వీటిని తన బ్యాగులో వేశాడని ఆమె చెప్పారని అంటున్నారు. కాగా... అతడు గతంలో డ్రగ్స్‌ వినియోగిస్తూ పోలీసులకు చిక్కి.. అనంతరం దందా మొదలుపెట్టాడని తెలుస్తుంది.

లావణ్య మొబైల్ లో టాలీవుడ్ ప్రముఖులు..?:

ఈ క్రమంలో... మోకిలా డ్రగ్స్ కేసులోనూ, వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోను లావణ్య నిందితురాలిగా ఉన్నట్లు చెబుతున్నారు! ఇదే క్రమంలో... కొంతమంది సింగర్లు, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ వ్యక్తులు ఆమెకు కాంటాక్ట్‌ లో ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ప్రస్తుతం కోకాపేటలో ఓ విల్లాలో నివాసం ఉంటున్న ఆమెవద్ద లభించిన డ్రగ్స్ తో పాటు మొబైల్ లోని కాంటాక్ట్స్ పై కూడా ఆరాతీస్తున్నారని తెలుస్తుంది!!

ఇందులో భాగంగా... మొబైల్ లోని కాంటాక్ట్స్ తో పాటు, ఆమె సోషల్ మీడియా అకౌంట్లలోని వ్యక్తిగత చాట్‌ హిస్టరీని పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారంలో కూడా తీగ లాగితే డొంకంతా కదులుతున్నట్లుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!