Begin typing your search above and press return to search.

అట్టెట్టా కేసీఆర్? పార్టీ మారే వారిని ఓడించాలంటే దెబ్బ పడదా?

2014 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని.. 2018లో కాంగ్రెస్ తరఫు పోటీ చేసి గెలిచిన వారిని తమ పార్టీలో ఎందుకు చేర్చుకున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 1:30 PM GMT
అట్టెట్టా కేసీఆర్? పార్టీ మారే వారిని ఓడించాలంటే దెబ్బ పడదా?
X

కొన్నిసార్లు అంతే.. ఎంత తెలివైనోడైనా సరే.. ఒత్తిడిలో ఉన్న వేళలో తప్పులు చేస్తుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. గులాబీ బాస్ కేసీఆర్ మాటలు ఇదే రీతిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న మాటకు.. ప్రచారానికి తగ్గట్లు పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి క్యూ కడుతున్న వైనం గులాబీ గూట్లో కొత్త గుబులు పుట్టిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ మాటల్లోనూ వస్తున్న తేడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రత్యర్థులకు తన మాటలతో షాకులు ఇవ్వాల్సిన కేసీఆర్.. తన మాటలకు తానే ఆత్మరక్షణలో పడేలా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఖమ్మం.. మహబూబాబాద్.. వరంగల్ జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడిన కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనకే ప్రతికూలంగా మారతున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నేతల్ని తమ పార్టీలోకి తీసుకొన్న కేసీఆర్ లాంటి వారి నోటి నుంచి వచ్చే నీతులకు విలువ ఉంటుందా?అని ప్రశ్నిస్తున్నారు.

తాను తప్పించి మరెవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఆగమైపోతుందన్న మాట పరమ రోటీన్ గా మారిందన్న విమర్శ వినిపిస్తోంది. ‘పార్టీ మారే వారిని.. డబ్బు మదంతో వచ్చే వారిని ఓడించాలి’ అని పిలుపునిస్తున్న కేసీఆర్.. పదేళ్ల క్రితం అప్పటి టీఆర్ఎస్ లో ఉన్న నేతలకు అదనంగా ఇతర పార్టీల నేతలు ఎందుకు వచ్చినట్లు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున టికెట్లు వచ్చిన వారిలో.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేసీఆర్ ఎందుకు టికెట్లు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.

2014 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని.. 2018లో కాంగ్రెస్ తరఫు పోటీ చేసి గెలిచిన వారిని తమ పార్టీలో ఎందుకు చేర్చుకున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు. తాము చేస్తే నీతి.. అవతలోడు చేస్తే దారుణమని వ్యాఖ్యలు చేయటం సరికాదంటున్నారు. పార్టీలకు పార్టీలే లేకుండా చేసి.. ఆయా పార్టీల నేతలకు పెద్ద పదవులు ఇచ్చేసి.. ఉద్యమం నుంచి పార్టీలో ఉన్న నేతల్లో ఎందరికి పదవుులు దక్కాయి? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ.. నీతుల గురించి కేసీఆర్ మాట్లాడినా.. ఇతర పార్టీల్లోకి వెళ్లే వారిపై కామెంట్లు చేసినా.. దాని ప్రభావం తన మీదా పడుతుందన్న విషయాన్నికేసీఆర్ గుర్తించాలని చెబుతున్నారు.

దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం తలొంచి తెలంగాణ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితిని కేసీఆర్ క్రియేట్ చేయలేదని.. ఇలాంటి వ్యాఖ్యలు అమరవీరులను అవమానించటమే అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ వర్గాలకు చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా ఆత్మబలిదానాన్ని ఇవ్వలేదని.. బలిపీఠాల మీదకు ఎక్కించి సామాన్యులేనని.. వారి ప్రాణత్యాగానికి ఫలితమే తెలంగాణ సాధన అన్న విషయాన్ని మర్చిపోలేదన్న కౌంటర్లు కేసీఆర్ వ్యాఖ్యలు వస్తున్నాయి.

మొన్నటి వరకు తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి చెప్పిన కేసీఆర్.. ఈ రోజు తెలంగాణ సాధన మొత్తం తన ఒక్కడి వల్లనే.. తన పోరాటం వల్లనే అంటూ తనను తాను కీర్తించుకోవటం మైనస్ గా మారుతుందని చెబుతున్నారు. మితిమీరిన అహంకారాన్ని.. తన గొప్పను తానే చెప్పుకునే నేతల్నితెలంగాణ ప్రజలు అస్సలు ఇష్టపడరన్న నిజాన్ని కేసీఆర్ మిస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. బహిరంగ సభల సందర్భంగా ముఖ్యమంత్రి మరింత ఆచితూచి మాట్లాడటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.