మోడీ 'నారీ అస్త్రం' పనిచేసిందా!
ఎన్నికల ఫలితాలు దాదాపు వచ్చేశాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండు రాష్ట్రాల్లో స్ట్రయి ట్ గా విజయం ధక్కించుకుంది.
By: Garuda Media | 4 May 2026 11:16 PM ISTఎన్నికల ఫలితాలు దాదాపు వచ్చేశాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండు రాష్ట్రాల్లో స్ట్రయి ట్ గా విజయం ధక్కించుకుంది.(పశ్చిమ బెంగాల్-అస్సాం). ఇక, కూటమి కట్టి.. పుదుచ్చేరిలోనూ విజయ దుందుభి మోగించింది. మరోవైపు తమిళనాడులోనూ కాలం కలిసి వచ్చి.. టీవీకే అధినేత విజయ్ కనుక పొత్తు పెట్టుకుంటే(పొత్తు తప్పదు) ఇక్కడ కూడా బీజేపీ అధికార పక్షంలోకి వచ్చేసినట్టే!.
వెరసి.. ఒకే ఒక్క కేరళలో మాత్రమే బీజేపీ గెలుపు గుర్రం ఎక్కలేదు. అయితే.. పరిణామాల వెనుక ప్రధాని నరేంద్ర మోడీ మోగించిన నారీ అస్త్రం ఏమేరకు ఫలించిందనేది ప్రశ్న. ఎన్నికల సమయంలో ముఖ్యం గా తొలిదశలో ఏప్రిల్ 23వ తేదీన అస్సాం, తమిళనాడు, కేరళ, బెంగాల్ (తొలిదశ) ఎన్నికలు జరిగిన సమయంలో ఆయన నారీ శక్తివందన పేరుతో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదికి తెచ్చారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చర్చించారు.
అంతేకాదు.. పెద్ద ఎత్తున మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా అన్ని భాషల పత్రికల్లోనూ మోడీ ప్రత్యేక వ్యాసాలు కూడా రాశారు. ఇక, పార్లమెంటు సమావేశాల్లో ఏకబిగిన ఆయన 40 నిమిషాల పాటు ప్రసంగించారు. మహి ళల కోసం తాము కట్టుబడి పనిచేస్తున్నామని.. మహిళా బిల్లు అత్యంత అవసరమని పేర్కొన్నారు. అయి తే.. పార్లమెంటులో ఈ బిల్లు(వాస్తవానికి మహిళా బిల్లు కాదు. అలాగని ప్రచారం చేశారు) వీగిపోయింది. అనంతరం.. దీనినే మోడీ ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో మరింత ఎక్కువగా దీనిపై ప్రధాని మోడీ ప్రచారం చేశారు. మమత సర్కారు మహిళల కు వ్యతిరేకమని ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే.. ఇది వర్కవుట్ అయినట్టు తెలుస్తోంది. మహిళలు ఎక్కువగా ఉన్న కీలక నియోజకవర్గాల్లో బీజేపీ ఏకపక్షం విజయం దక్కించుకుంది. అలానే.. తమిళనాడు లో అన్నాడీఎకే కేవలం 30-50 స్థానాలకు పరిమితం అవుతుందన్న అంచనాలు పటాపంచలై.. తాజాగా 60కి పైగా స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తంగా మోడీ చేసిన నారీ అస్త్ర ప్రయోగం వర్కవుట్ అయిందనే అంటున్నారు పరిశీలకులు.
