Begin typing your search above and press return to search.

ఈ సారాన్నా బిల్లు ఆమోదం పొందుతుందా ?

నరేంద్ర మోదీ హయాంలో మహిళల కోసం చాలా మాట్లాడుతునే ఉన్నారు కానీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మాత్రం అనుకోలేదు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 5:48 AM GMT
ఈ సారాన్నా బిల్లు ఆమోదం పొందుతుందా ?
X

ఇపుడిదే అందరిలోనూ పెరిగిపోతున్న అనుమానాలు. 1996 నుండి వివిధ కారణాలతో పార్లమెంటులో పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం విషయం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. విచిత్రం ఏమిటంటే పార్లమెంట్ బయట అందరు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పాజిటివ్ గా మాట్లాడుతారు. అయితే పార్లమెంటులో బిల్లు పెట్టి పాస్ చేయమంటే మాత్రం ఫెయిలవుతుంటుంది. మొదటసారి దేవేగౌడ హయాంలో ఈ బిల్లు 1996లో పార్లమెంటులో అడుగుపెట్టింది.

తర్వాత వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ కాలంలో కూడా పార్లమెంటులోకి ప్రవేశించినా ఆమోదం మాత్రం పొందలేదు. ఒక సమయంలో యాదవ్ ధ్వయం లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లు పార్లమెంటులో రిజర్వేషన్ బిల్లు కాపీలను చింపేసి నానా వీరంగం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మన్మోహన్ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో 2010లో ఆమోదం పొందినా లోక్ సభలో ఆమోదం పొందలేదు. తర్వాత పార్లమెంటు కాలపరిమితి ముగియటంతో బిల్లు మురిగిపోయింది.

నరేంద్ర మోదీ హయాంలో మహిళల కోసం చాలా మాట్లాడుతునే ఉన్నారు కానీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మాత్రం అనుకోలేదు. అలాంటిది ఇంతకాలానికి అన్నివైపుల నుండి పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా మంత్రివర్గ సమావేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలును ఆమోదించింది.

మరీ ప్రత్యేక సమావేవశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారా లేదా అన్నది తేలటంలేదు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లును క్యాబినెట్లో పాస్ చేసినందకు ట్విట్టర్ ద్వారా మోడీకి ధన్యవాదాలు చెప్పిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కొద్దిసేపటికే ట్వీట్ ను తీసేశారు.

ఎందుకు ట్వీట్ చేశారు ? కొద్దిసేపటికే ఎందుకు ట్విట్ ను తీసేశారో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఏదేమైనా మంగళవారం నుండి జరగబోయే ప్రత్యేక సమావేశాల అజెండాపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. మరిందులో ఏది నిజం ? ఏది అబద్ధమో కూడా జనాలకు అర్ధంకావటంలేదు. ఎందుకంటే అజెండా విషయాన్ని ఎక్కడా లీక్ కాకుండా మోడీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.