Begin typing your search above and press return to search.

ఏపీలో క్రైమ్ రేటు -గీత దాటారో ?

టెక్నాలజీ పెరగడంతో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం ఉందని అన్నారు. దాంతో తి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు.

By:  Satya P   |   21 Feb 2026 4:00 AM IST
ఏపీలో క్రైమ్ రేటు -గీత దాటారో ?
X

ఏ రాష్ట్రం అయినా ఎలా ఉంది అన్నది లెక్క వేయాలన్నా కొలమానం చూడాలి అన్నా లా అండ్ ఆర్డర్ నే అంతా చూస్తారు. అలా చూస్తేనే ఆ రాష్ట్రం ఏ పొజిషన్ లో అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే గత ఇరవై నెలల కూటమి పాలనలో ఏపీ ఎలా ఉంది అంటే దానికి హోం మంత్రి వంగలపూడి అనిత జవాబు చెప్పారు. ఏపీలో జనరల్ క్రైమ్ రేటు బాగా తగ్గింది అని ఆమె అన్నారు. అది ఏకంగా ఆరు శాతం తగ్గింది అని ఆమె చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేయడం వల్లే క్రైమ్ రేట్ తగ్గిందని ఆమె అన్నారు. అందుకే దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆమె వెల్లడించారు.

మహిళలకు భయం :

ఇక గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు బయటకు రావడానికి భయపడేవాళ్లు అని ఆమె గుర్తు చేశారు ఆనాటి పరిస్థితి అది అయితే తమ ప్రభుత్వంలో అంతా సంతోషంగా ఉంటున్నారు అని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని ఆమె చెప్పారు. కానీ చంద్రబాబు పాలనలో కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు శక్తి యాప్, శక్తి టీమ్స్ తో మహిళా రక్షణకు కృషి చేస్తున్నామని అంటున్నారు అందుకే రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని అనిత అంటున్నారు.

సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు :

టెక్నాలజీ పెరగడంతో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం ఉందని అన్నారు. దాంతో తి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు. ప్రజలకు వివిధ కార్యక్రమాలు ద్వారా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని కూటమి ప్రభుత్వంలో నేరస్తులందరికీ అర్ధం అయింది అన్నారు. ఎంతటి వారు అయినా గీత దాటితే కటకటాలే అని అనిత హెచ్చరించడం విశేషం. వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని, అది లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అనిత సెటైర్లు వేశారు.

వైసీపీకి స్ట్రాంగ్ గా :

ఒక వైపు వైసీపీ నేతలు జైలు నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్న వేళ హోం మంత్రి ఈ విధంగా హెచ్చరికలను జారీ చేయడం విశేషం. ఎంతటి వారు అయినా జైలుకు అని ఆమె స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇస్తున్నారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలనుకుంటే వదిలేది లేదని కూడా ఆమె అంటున్నారు. మరి హోం మంత్రి మాటలు వైసీపీ నేతల చెవిన పడినట్లేనా అన్నదే చూడాల్సి ఉంది.