Begin typing your search above and press return to search.

అమెరికాలో యువతి ఆరాచకం.. కారుతో స్టంట్ పూర్తిగా తేడా కొట్టేసింది

కొలరాడో స్ప్రింగ్స్ లోని ఒక మాల్ బయట.. విశాలంగా ఉన్న ప్లేస్ లో.. తన స్నేహితుల్ని కారులో ఎక్కించుకున్న ఆమె.. కారును వేగంగా వెనక్కి తిప్పుతూ.

By:  Tupaki Desk   |   20 Dec 2023 5:30 AM GMT
అమెరికాలో యువతి ఆరాచకం.. కారుతో స్టంట్ పూర్తిగా తేడా కొట్టేసింది
X

అత్యుత్సాహంతో చేసే పనులు అనుకోని పరిణామాలకు దారి తీస్తాయి. తాజా ఉదంతం ఆ కోవలోకే వస్తుంది. అమెరికాలోని ఒక యువతి తన స్నేహితులతో కలిసి కారుతో చేసిన ఒక స్టంట్ మొదటికే మోసంవచ్చేలా చేసింది. కారును రివర్సుకు తీసుకునే క్రమంలో.. ప్రమాదకరంగా సర్కిల్ గా తిప్పేయటం.. అది కూడా వేగంగా చేయటంతో.. కారు కాస్తా బోల్తా పడింది. ఈ ఉదంతంలో ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కొలరాడో స్ప్రింగ్స్ లోని ఒక మాల్ బయట.. విశాలంగా ఉన్న ప్లేస్ లో.. తన స్నేహితుల్ని కారులో ఎక్కించుకున్న ఆమె.. కారును వేగంగా వెనక్కి తిప్పుతూ.. ఒక్కసారిగా కట్ కొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సదరు ఎస్ వీయూ వాహనం బోల్తా పడింది. అప్పటికే ఐదుగురు యువకులు కార్ల డోర్ల లోని బయటకు చూస్తూ.. కేరింతలు కొడుతున్నారు. అనూహ్యంగా కారు బోర్లా పడింది.

దీంతో.. కారులోని వారు నలిగిపోయారు. ప్రమాదానికి కారణమైన యువతి స్వల్ప గాయాలతో బయటపడగా.. సదరు యువతి స్నేహితులు మాత్రం తీవ్ర గాయాల బారిన పడ్డారు. కారు బోల్తా పడినంతనే మాల్ వద్ద ఉన్నపలువురు వారికి సాయం చేశారు. కారులో నుంచి బయటకు తీసి.. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతంలో కారు కింద నలిగిన మహిళ స్నేహితుల పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన యువతి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.