Begin typing your search above and press return to search.

గేటు మూసే విష‌యంలో గొడ‌వ‌.. రెచ్చిపోయిన మ‌హిళ‌.. చెవి కొరికి మింగేసింది!

ఇలానే.. గేట్ వేయడం మర్చిపోయాడన్న కోపంతో ఓ మ‌హిళ‌ వాగ్వాదానికి దిగింది. అది కాస్తా భౌతికంగా దాడి చేసే వరకూ వెళ్లింది.

By:  Tupaki Desk   |   10 March 2024 11:30 PM GMT
గేటు మూసే విష‌యంలో గొడ‌వ‌.. రెచ్చిపోయిన మ‌హిళ‌.. చెవి కొరికి మింగేసింది!
X

గేట్‌ మూసే విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళ ఓ పురుషుడి చెవి కొరికి మింగేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచల‌నంగా మారింది. సాధార‌ణంగా అద్దెకు ఉండే వాళ్ల‌విష‌యంలో కొన్ని ఆంక్ష‌లు, నిబంధ‌న‌లు ఉంటాయి. వీటిని పాటించ‌క‌పోతే.. య‌జ‌మానుల నుంచి ఖ‌చ్చితంగా వివాదాలు వ‌స్తూనే ఉంటాయి. ఇలానే.. గేట్ వేయడం మర్చిపోయాడన్న కోపంతో ఓ మ‌హిళ‌ వాగ్వాదానికి దిగింది. అది కాస్తా భౌతికంగా దాడి చేసే వరకూ వెళ్లింది.

అంతేకాదు.. పురుషుడి మీద పడిపోయి చెవి గట్టిగా కొరికింది. ఆ తరవాత కొరికిన ముక్కని ఏమాత్రం జంకు లేకుండా మింగేసింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. న్యూ ఆగ్రాలో తమ ఇంటి పక్కనే ఈ మహిళ ఉంటోందని వివరించాడు. చుట్టుపక్కల వాళ్లతో రోజూ ఇలాగే గొడవ పడుతోందని చెప్పాడు. మార్చి 4వ తేదీన తన కొడుకుని ఎగ్జామ్‌హాల్‌కి తీసుకెళ్లేందుకు ఉదయం 6 గంటలకే బయటకు వచ్చాడు బాధితుడు. ఆ తొందరలో గేట్ వేయడం మర్చిపోయాడు.

ఆ సమయంలోనే గేటు ఎందుకు వేయ‌వు.. కుక్క‌లు వ‌స్తే.. మేం బ‌లికావాలా? అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఆ మహిళ గొడవ పెట్టుకుంది. బూతులు తిట్టడం మొదలు పెట్టింది. దీంతో విసిగిపోయిన బాధితుడు ఆమెని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్ర‌మంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ద‌రు మహిళ భర్త వివాదాన్ని చ‌ల్లార్చాల్సింది పోయి.. మ‌రింత పెంచాడు. బాధితుడిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ గొడవలోనే ఆమె అతని చెవి కొరికేసింది. ఆధారాలు ల‌భించ‌కుండా ముక్క‌ను మింగేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.