Begin typing your search above and press return to search.

విమానంలో బట్టలిప్పి బయటకు పంపండని గోల చేసిన మహిళ

విమాన ప్రయాణంలో ఓ మహిళ తనను బయటికి పంపాలని అరుస్తూ, ఒంటిపై దుస్తులు లేకుండా కేకలు వేసిన ఘటన సంచలనం రేపింది.

By:  Tupaki Desk   |   7 March 2025 3:00 PM IST
విమానంలో బట్టలిప్పి బయటకు పంపండని గోల చేసిన మహిళ
X

విమాన ప్రయాణంలో ఓ మహిళ తనను బయటికి పంపాలని అరుస్తూ, ఒంటిపై దుస్తులు లేకుండా కేకలు వేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల మాటల ప్రకారం, ఆమె సుమారు అరగంటపాటు అలా అరుస్తూనే ఉండింది.

- ఏం జరిగిందంటే?

విమానంలోని సిబ్బంది కథనం ప్రకారం., ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఓ మహిళ తన దుస్తులను విసిరేసి "బయటికి పంపండి బాబో" అంటూ గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆమె ప్రవర్తనను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. సిబ్బంది ఆమెను శాంతపరిచేందుకు ప్రయత్నించినా, ఆమె వ్యవహారం ఆగలేదు.

- ఎందుకు అలా ప్రవర్తించింది?

ఆమె ప్రవర్తనకు కారణం ఏమిటో ఇంకా స్పష్టత రాలేదు. అయితే మానసిక స్థితి సమస్యల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరు ప్రయాణికులు ఆమె న్యూస్ డ్రగ్స్ లేదా మద్యం ప్రభావంలో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సదరు మహిళను విమాన సిబ్బంది అదుపులోకి తీసుకుని, ల్యాండ్ అయ్యిన వెంటనే అధికారులకు అప్పగించారు.

- ప్రయాణికుల భయాందోళనలు

ఈ సంఘటన విమాన ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. విమానం హఠాత్తుగా గందరగోళానికి గురికావడంతో కొంతమంది భయంతో కుర్చీలలోకి చేరిపోయారు. సిబ్బంది అత్యవసరంగా స్పందించి, ఆమెను అదుపులోకి తీసుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

- విమానయాన సంస్థ స్పందన

సదరు విమానయాన సంస్థ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. "మా ప్రయాణికుల భద్రతే మా ప్రధాన లక్ష్యం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం" అని సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగు చూడనున్నాయి.