Begin typing your search above and press return to search.

చనిపోయాక ఏం జరిగిందంటే? చచ్చి బతికిన మహిళ వెల్లడి

ఇవి జీవిత చక్రంలో సహజంగా జరిగే పరిణామాలు. ఒక మనిషి తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి

By:  Tupaki Desk   |   10 Jun 2025 10:00 PM IST
చనిపోయాక ఏం జరిగిందంటే? చచ్చి బతికిన మహిళ వెల్లడి
X

పుట్టుక, ఎదుగుదల, వృద్ధాప్యం, చివరికి మరణం. ఇవి జీవిత చక్రంలో సహజంగా జరిగే పరిణామాలు. ఒక మనిషి తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే, వృద్ధాప్యం తర్వాత మరణం సంభవించినప్పుడు ఏమి జరుగుతుంది అనే ప్రశ్న ఎప్పటి నుంచో మానవాళిని వెంటాడుతోంది. సినిమాలు, కల్పిత సాహిత్యంలో ఎన్నో ఊహాత్మక విషయాలు చెప్పినప్పటికీ, వాటికి శాస్త్రీయ ఆధారం లేదు. మరణానంతర జీవితం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేస్తున్నప్పటికీ మరణానికి దగ్గరగా వెళ్లి ఆ అనుభవాలను తెలుసుకోవడం కష్టమని వారు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో అమెరికాలోని కొలరాడో ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల బ్రయానా లాఫర్జీ అనే మహిళ తన వినూత్న అనుభవంతో సంచలనం సృష్టించారు. ఇటీవల ఆమె 8 నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని చవిచూసి, ఆ తర్వాత తన అనుభవాలను వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

బ్రయానా లాఫర్జీ అనుభవం అందరినీ ఆశ్చర్యపరిచింది.. "శరీరానికి చావుంది, ఆత్మకు లేదు" అని తెలిపింది. బ్రయానా లాఫర్జీ మైక్లోనస్ డైస్టోనియా అనే ప్రాణాంతక మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె 8 నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని అనుభవించినప్పుడు జరిగిన పరిణామాలను బయటపెట్టారు. ఆమె మాటల్లో "నేను కన్ను మూసిన తర్వాత మొత్తం చీకటిగా కనిపించింది. కొంత సమయం తర్వాత నేను ఇంకో లోకంలోకి వెళ్ళిపోయాను. వైద్యులు నన్ను వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించారని నాకు అర్థమైంది, కానీ నేను మాత్రం స్పృహలోకి వచ్చినట్లు అనిపించింది. నా శరీరం నుండి భౌతికంగా వేరు చేయబడినట్లు భావన కలిగింది. నేను అప్పటికే బతికే ఉన్నాననే అనుభూతి నాకు దక్కింది. కన్నుమూసేటప్పుడు నాకు ఎటువంటి నొప్పి, బాధ కలగలేదు. కేవలం మనశ్శాంతి మాత్రమే మెండుగా దక్కింది." అని ఆమె పేర్కొంది.

"శరీరం నుంచి వేరుపడిన తర్వాత నా ఆత్మ దేహం నుంచి అలా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. అక్కడ మనుషులు లేరు, కాకపోతే వేరే రకమైన జీవులు ఉన్నాయి. అక్కడ సమయం ఎలా ఉంటుందో తెలియదు గానీ, ప్రతిదీ సందర్భం ప్రకారం జరుగుతోంది. మనుషులుగా మనం కేవలం తాత్కాలికం మాత్రమే. మరణం తర్వాత మనిషి ఆలోచన సరళి పూర్తిగా మారిపోతుంది." అని పేర్కొంది.

క్లినికల్ మరణం తర్వాత బ్రయానా ఎదుర్కొన్న సమస్యలు

బ్రయానా లాఫర్జీ ఈ లోకానికి తిరిగి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నడవడంలో తడబడటం, మాట్లాడటంలో ఇబ్బంది పడటం వంటి సమస్యలు తలెత్తాయి. పిట్యూటరీ గ్రంథిలో కూడా ఆమె సమస్యను ఎదుర్కొన్నారు. చివరికి ఆమె మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

బ్రయానా లాఫర్జీ అనుభవం మరణం తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై కొత్త చర్చకు దారితీసింది. ఆమె చెప్పిన విషయాలు శాస్త్రీయంగా నిరూపించబడనప్పటికీ, మరణానంతర అనుభవాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.