Begin typing your search above and press return to search.

మోడీతో ఇక‌, మ‌హా భార‌త యుద్ధ‌మే: మ‌హిళా ఎంపీ సంచ‌ల‌న శ‌ప‌థం

గ‌త కొన్నాళ్లుగా జ‌రుగుతున్న వివాదానికి పార్ల‌మెంటు శుక్ర‌వారం ముగింపు ప‌లికింది.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:39 PM GMT
మోడీతో ఇక‌, మ‌హా భార‌త యుద్ధ‌మే:  మ‌హిళా ఎంపీ సంచ‌ల‌న శ‌ప‌థం
X

''మోడీ స‌ర్కారుతో ఇక‌, మ‌హా భార‌త యుద్ధం చేస్తాం. గెలుపో.. ఓట‌మో తేల్చుకుంటాం. ఇది త‌ధ్యం'' అని నిండుపార్ల‌మెంటులో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ(బెంగాల్) మ‌హువా మొయిత్రా సంచ‌ల‌న శ‌ప‌థం చేశారు. గ‌త కొన్నాళ్లుగా జ‌రుగుతున్న వివాదానికి పార్ల‌మెంటు శుక్ర‌వారం ముగింపు ప‌లికింది. మ‌హువా మొయిత్రా.. కొంద‌రి నుంచి డ‌బ్బులు, కానుక‌లు తీసుకుని.. పార్ల‌మెంటులో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నార‌ని, ముఖ్యంగా అదానీ గ్రూప్‌కు సంబంధించి ఆమె ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. కొన్నాళ్లుగావివాదం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్ ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ‘‘ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. అందువల్ల ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదు’’ అని స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే, ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీ సహా పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీంతో నివేదికపై కొంతసేపు చర్చించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతినిచ్చారు. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అయితే, ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహువా కోరగా.. సభాపతి అందుకు నిరాకరించారు. అనంతరం మూజువాణీ ఓటింగ్‌ ద్వారా.. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ బిర్లా ప్ర‌క‌టించారు.

అనంత‌రం బ‌యట‌కు వ‌చ్చిన మొహువా.. మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై భార‌త యుద్ధాన్ని ప్ర‌క‌టిస్తున్నామ‌ని అన్నారు. తన బహిష్కరణను మహువా తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఎథిక్స్‌ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించింది. మమ్మల్ని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలను నమ్మి నన్ను దోషిగా నిర్ధారించారు. ఇక, రేపు మా ఇంటికి సీబీఐని పంపించి నన్ను వేధిస్తారేమో’’ అని మహువా మండిపడ్డారు.