Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డి గడ్డం తీస్తారా..? కిం కర్తవ్యం

నాని, జగ్గారెడ్డి ఐదేళ్లకోసారి ఎన్నికలు పూర్తయ్యాక తిరుమల వెళ్లి తలనీలాలు ఇచ్చి వచ్చేవారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 3:30 AM GMT
జగ్గారెడ్డి గడ్డం తీస్తారా..? కిం కర్తవ్యం
X

గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ప్రజా ప్రతినిధులు- నాయకులు క్లీన్ షేవ్ తోనే ఉండేవారు. అయితే, కొంతకాలంగా మాత్రం ఈ సంప్రదాయం మారింది. అసలు ఆ మాటకొస్తే రాజకీయ నాయకుడు క్లీన్ షేవ్ తో ఉండాలన్న సంప్రదాయమే లేదు. కానీ.. ప్రజల్లో ఉంటున్నందున హుందాగా కనిపించేందుకు నాయకులు/ప్రజాప్రతినిధులు రోజూ గడ్డం చేసుకుంటుంటారు. కానీ కొందరు మాత్రం గడ్డం పెంచుతూనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఏపీలో ఇలాంటి వారిలో ముఖ్యంగా వినిపించే పేరు మాజీ మంత్రి కొడాలి నాని. తెలంగాణలో అయితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

ఐదేళ్లకోసారి తలనీలాలు

నాని, జగ్గారెడ్డి ఐదేళ్లకోసారి ఎన్నికలు పూర్తయ్యాక తిరుమల వెళ్లి తలనీలాలు ఇచ్చి వచ్చేవారు. నాని విషయంలో ఇంకా సమయం ఉంది కాబట్టి చెప్పలేం కానీ.. జగ్గారెడ్డి సంగతి ఏమిటా? అనేది చూడాలి. సంగారెడ్డి నుంచి ఇటీవలి ఎన్నికల్లో జగ్గారెడ్డి పరాజయం పాలయ్యారు. పదేళ్ల తర్వాత అయినా తెలంగాణ సీఎం అవుతానని ప్రకటించిన ఆయన ఓడిపోవడం అంటే అది అనూహ్యమే. ఒకవేళ గెలిచి ఉంటే జగ్గారెడ్డి మంత్రి పదవి రేసులో కచ్చితంగా ఉండేవారు. ఈ పరాజయం ఆయనను రాజకీయంగా దెబ్బతీసేదే. మరిప్పుడు కూడా తిరుమలకో మరో పుణ్య క్షేత్రానికో వెళ్లి తలనీలాలు ఇస్తారా? లేదా? అనేది చూడాలి.

చేజేతులా చేసుకున్నదే..

వాస్తవానికి బీఆర్ఎస్ హవా సాగిన 2018లోనే జగ్గారెడ్డి విజయం సాధించారు. 2014లో ఓడినా పుంజుకుని నెగ్గారు. ఈసారి కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం ఉన్న సమయంలో జగ్గారెడ్డి పరాజయం పాలవడం గమనార్హం. దీనికి స్థానిక వర్గాలు తమదైన విశ్లేషణ చేస్తున్నాయి. జగ్గారెడ్డి కొన్నేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారని, హైదరాబాద్ లోనే ఉంటూ మీడియాలో కనిపించేందుకు ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థి చింతా ప్రభాకర్ మాత్రం స్థానికంగా ఉంటూ ప్రజలను, మీడియాను సమన్వయం చేసుకున్నారని పేర్కొంటున్నారు. దీంతోనే జగ్గారెడ్డి ఓటమికి బాటలు పడ్డాయని వివరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా.. రేవంత్ పై వ్యతిరేకత వ్యస్తం చేసేవారు జగ్గారెడ్డి. ఇప్పుడదే రేవంత్ సీఎం కాబోతున్నారు. ఓ దశలో బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారమూ జరిగింది. మరిక ఇప్పుడు రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో?

ఐదేళ్లు గడ్డం పెంచుతారా?

జగ్గారెడ్డి త్వరలో తలనీలాలు ఇస్తారా? లేక మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచేవరకు గడ్డం,మీసాలు పెంచుతారా? అనేది చూడాలి. ఇది వ్యక్తిగత పరాజయం కాబట్టి నిర్ణయం ఆయనదే అయి ఉంటుంది. పీసీసీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని శపథం చేశారు. ఈ ఎన్నికలతో ఆయన శపథం నెరవేరింది. తాను గడ్డం తీస్తానని ఉత్తమ్ ప్రకటించారు కూడా. ఇక జగ్గారెడ్డి సంగతి ఏమిటో?

కొసమెరుపు: కొడాలి నాని కేవలం గడ్డం మాత్రమే పెంచుతారు. జగ్గారెడ్డి గడ్డంతో పాటు జుట్టు కూడా పెంచుతారు. ఎన్నికల అనంతరం పూర్తిగా తీసివేస్తారు. మరిప్పుడు జగ్గారెడ్డి జుట్టు, గడ్డం కూడా పెంచుతారా? లేదా? అనేది చూడాలి.