Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కి రిసోర్ట్స్ తో పని ఉంటుందా!

కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్ కి డెబ్బై నుంచి ఎనభై సీట్ల దాకా వస్తాయని లెక్క వేశాయి.

By:  Tupaki Desk   |   1 Dec 2023 2:25 PM IST
కాంగ్రెస్ కి రిసోర్ట్స్ తో పని ఉంటుందా!
X

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అన్నీ దాదాపుగా చెప్పేశాయి. ఇక మెజారిటీ కూడా కాంగ్రెస్ సాధిస్తుంది అని స్పష్టం చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్ కి డెబ్బై నుంచి ఎనభై సీట్ల దాకా వస్తాయని లెక్క వేశాయి. అంటే నాలుగింట మూడు వంతుల సీట్లు అన్న మాట.

ఇది ఒక విధంగా బంపర్ విక్టరీగానే చూడాలి. మరి అంతటి విజయం కాంగ్రెస్ కి దక్కితే రిసోర్ట్స్ లో ఎమ్మెల్యేలను తరలించే రాజకీయం ఉంటుందా అన్నది కీలకమైన చర్చగా ఉంది. అయితే జరుగుతున్న ప్రచారం చూస్తే డిసెంబర్ 3న ఫలితాలు వచ్చిన తరువాత గెలిచిన ఎమ్మెల్యేలను కర్ణాటక తరలిస్తారు అని. అలాగే అక్కడ ఇప్పటికే ఒక ఫార్మ్ హౌజ్ ని బుక్ చేశారు అని అంటున్నారు.

అయితే ఆరు నూరు అయినా కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ 65 దాకా సీట్లు వస్తాయని అంటున్నారు. అంటే ఇది సింపుల్ మెజారిటీకి కాస్తా ఎక్కువ. దాంతోనే కాంగ్రెస్ ముందు జాగ్రత్త పడుతుందా అన్నదే చర్చకు వస్తున్న విషయం. ఎందుకంటే దరిదాపులలో కనుక సీట్లు వస్తే గోడ దూకుళ్ళు ఏమైనా ఉంటాయా అన్నది కూడా సందేహించి కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలకు రంగం సిద్ధం చేస్తోందా అన్నదే ఇపుడు హాట్ టాపిక్.

ఇదిలా ఉంటే కర్నాటకలో ఒక ప్రముఖ ఫార్మ్ హౌజ్ ని ఇప్పటికే కాంగ్రెస్ రిజర్వ్ చేసి ఉంచింది అని అంటున్నారు. దాంతో విజేతలు అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అక్కడికి తరలించడం ద్వారా తమదైన రాజకీయాన్ని చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఇటీవల కాలంలో కొత్త రాజకీయ ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఇలా గెలిచిన వారిని తీసుకుని తమ వైపు కలుపుకుని పోయే పాలిటిక్స్ సాగుతోంది. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త పడినా ఫలితాలు టోటల్ గా మార్చేసే సీన్ ఉంటుందని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇక ఇలాంటి అనుభవాలు కూడా భారత రాజకీయాలలో అందునా వర్తమానంలో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటోంది అని అంటున్నారు. ఎన్నికల్లో గెలవడమె కాదు, ప్రభుత్వాన్ని స్థాపించడం కూడా ఒక బలమైన సవాల్ గానే ఉంటోంది అన్నది కాంగ్రెస్ కి బాగా తెలుసు అంటున్నారు.

మొత్తానికి చూస్తే తెలంగాణాలో ఇలా ఫలితాలు రావడమేంటి అలా క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. ఇక హంగ్ అసెంబ్లీ కనుక వస్తే అటూ ఇటూ కూడా క్యాంప్స్ మొదలవడం ఖాయం అంటున్నారు. ఏది ఏమైనా రాక రాక కాంగ్రెస్ కి వస్తున్న అవకాశం అందువల్ల అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదని అంటున్న వారూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఎంత మెజారిటీ వచ్చినా ఈ క్యాంప్ రాజకీయాలు తప్పకపోవడం మాత్రం మన ప్రజాస్వామ్యానికి చేటు అని అంటున్నారు.