మళ్లీ వైసీపీ వస్తుందా.. ఈ చర్చకు రీజనేంటి.. ?
అయితే.. జగన్ కంటే బాగా చేస్తారన్న అభిప్రాయం, నమ్మకం మాత్రం ప్రజల్లో ఉంది. ఇది ప్రస్తుతం పచ్చ గానే ఉంది.
By: Tupaki Desk | 15 Jun 2025 1:00 AM ISTరాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా? జగన్ మళ్లీ సీఎం అవుతారా? ఇదీ.. ఇప్పుడు చర్చగా మారింది. మరీ ముఖ్యంగా కూటమి పార్టీల్లోనే ఈ చర్చ సాగుతోందంటే ఆశ్చర్యం వేస్తుంది. అయినప్పటికీ ఇది వాస్తవం. ఇటీవల కాలంలో జగన్ పదే పదే తాము అధికారంలోకి వస్తామని.. ప్రజల్లోకూటమిపై వ్యతిరే కత పెరిగిందని చెప్పుకొచ్చారు. అయితే.. పైస్థాయిలో ఉన్న నాయకులు దీనిని లైట్ తీసుకుంటున్నారు. జగన్ వచ్చేదీ లేదు.. చచ్చేదీ లేదు.. అన్న సామెతను గుర్తు చేస్తున్నారు.
కొన్నిరోజుల కిందట పవన్ కల్యాణ్ కూడా..దీనిపై నవ్వి వదిలేశారు. అంటే..జగన్ రావడం భ్రమేనన్నది ఆయన అర్ధం కావొచ్చు. అయితే.. పైకి కనిపిస్తున్నట్టుగా అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదు. కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం సానుకూలత ఉంది. కానీ, వచ్చే నాలుగు సంవత్సరాలు ఇలానే సానుకూలత ఉంటుందా? అనేది ప్రశ్న. ఉంటే మంచిదే.. కానీ, అలాంటి పరిస్థితి కనిపించేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలను మరింత సంతృప్తి పరచ్చాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రెండు కీలక విషయాల్లో సర్కారుపై అసంతృప్తి ఉంది. గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పినా.. మెజారిటీ లబ్ధిదారులకు ఇప్పటికీ నిధులు అందలేదు. ఇది తీవ్ర అసంతృప్తితోనే ఉంది. అభివృద్ది కావాలి. అదేసమయంలో ఇతర ప్రాంతాలను కూడా సమానంగానే అభివృద్ధి బాట పట్టించాలి. కానీ, గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు పెద్దగాపరిస్థితిలో మార్పులు రాలేదు.
అయితే.. జగన్ కంటే బాగా చేస్తారన్న అభిప్రాయం, నమ్మకం మాత్రం ప్రజల్లో ఉంది. ఇది ప్రస్తుతం పచ్చ గానే ఉంది. ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ.. ప్రభుత్వాన్ని ఆదిశగా అడుగులు వేయిస్తేనే ఫలి తం సానుకూలంగా ఉంటుంది. ఇక, పైకి కనిపిస్తున్నవి పక్కన పెడితే.. అంతర్గతంగా ఇసుక వ్యవహారం ఇప్పటికీ ప్రజలకు మింగుడు పడడం లేదు. ఉచితం అంటూనే వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తు న్నారు. రియల్ ఎస్టేట్ పుంజుకున్నట్టే పుంజుకుని కిందకి పడింది. సో.. ఈ విషయాలపై దృష్టి పెట్టి సరిచేసుకుంటే.. జగన్ మళ్లీ వస్తారా? అనే చర్చ కూటమిలో కనిపించకపోవచ్చు.
