Begin typing your search above and press return to search.

తప్పుడు కేసులతో భర్తను వేధించడంపై కోర్టు సంచలన వ్యాఖ్యలు!

వివరాళ్లోకి వెళ్తే... 2004లో వివాహమైన జంట 2012 వరకు కలిసి ఉన్నారు. ఈ సమయంలో... తన పుట్టింటికి వెళ్లిన భార్య.. భర్త, అతని తండ్రి, సోదరుడిపై వేధింపుల ఆరోపణలతో పోలీసు కేసులు పెట్టింది!

By:  Tupaki Desk   |   1 May 2024 3:30 PM GMT
తప్పుడు కేసులతో భర్తను వేధించడంపై కోర్టు  సంచలన వ్యాఖ్యలు!
X

మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన గృహహింస చట్టంలోని సెక్షన్ 498/ఏ ని కొంతమంది భార్యలు దుర్వినియోగం చేస్తున్నారనే చర్చ నిత్యం ఏదో ఒక మూల వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. వారి వారి వ్యక్తిగత కారణాలతోనో.. ఇంట్లో తల్లి చెప్పిందనో.. మరో కారణంతోనో భర్త నుంచి విడిపోవాలనుకునే మహిళలు అతనిపై గృహహింస కేసు పెట్టి వేదిస్తున్నారనే కామెంట్లూ వినిపిస్తుంటాయి! ఈ తరహా వ్యవహారంపై తాజాగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... భర్తపై లేని పోని ఆరోపణలతో కేసులుపెట్టే భార్యలు ఇటీవల పెరిగిపోతున్నారనే చర్చ సమాజంలో నేడు ఎక్కువగా నడుస్తుందని అంటున్న సంగతి తెలిసిందే! జీవితం విలువ తెలియని కొంతమంది అజ్ఞానంతో ఈ పనులు చేసుంటే... మరికొంతమంది ముందుచూపు లేక, చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... లేనిపోని ఆరోపణలతో భర్త, అతని కుటుంబ సభ్యులు, బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్‌ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కుటుంబ న్యాయస్థానం జారీ చేసిన విడాకులను రద్దు చేసి, దాంపత్య హక్కులను పునరుద్ధరించాలన్న ఓ మహిళ వినతిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెలువరించారు.

వివరాళ్లోకి వెళ్తే... 2004లో వివాహమైన జంట 2012 వరకు కలిసి ఉన్నారు. ఈ సమయంలో... తన పుట్టింటికి వెళ్లిన భార్య.. భర్త, అతని తండ్రి, సోదరుడిపై వేధింపుల ఆరోపణలతో పోలీసు కేసులు పెట్టింది! అయితే... న్యాయస్థానాలు వారిని నిర్దోషులుగా ప్రకటించాయి. అనంతరం భర్త రంగంలోకి దిగాడు.

తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా తప్పుడు కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసిన భార్యతో వైవాహిక బంధాన్ని ముగించుకోవడానికి అనుమతించాలంటూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో... 2023లో విడాకులు మంజూరయ్యాయి. దీనిని సవాల్‌ చేస్తూ మాజీ భార్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తీర్పు వెలువరించిన న్యాయమూర్తి జస్టిస్‌ వై.జి.ఖొబ్రగడే ఈ వ్యాఖ్యలు చేశారు!