Begin typing your search above and press return to search.

హనీమూన్ లో భర్త రాక్షసత్వం... ఠాణాలో భార్య ఫిర్యాదు!

కట్టుకున్నవాడే కర్కసడుగా మారితే... పెళ్లి చేసుకున్న భార్యనే బ్లాక్ మెయిల్ చేయాలనే ఆలోచనకు దిగితే

By:  Tupaki Desk   |   9 Oct 2023 1:30 AM GMT
హనీమూన్ లో భర్త రాక్షసత్వం... ఠాణాలో భార్య ఫిర్యాదు!
X

కట్టుకున్నవాడే కర్కసడుగా మారితే... పెళ్లి చేసుకున్న భార్యనే బ్లాక్ మెయిల్ చేయాలనే ఆలోచనకు దిగితే... ఏకాంత సమయన్ని కూడా బహిరంగ పరుస్తానని బెదిరింపులకు దిగితే... అప్పుడు ఆ ఇల్లాలి పరిస్థితి ఎలా మారిపోతుంది అనేది తాజాగా ఒక మహిళ జీవితంలో జరిగింది.

అవును... జీవితంలో అద్భుతమైన విషయాల్లో ఒకటైన హనీమూన్ జీవితంలో అత్యంత విషాదానికి కారణమైతే కారణమైతే ఆ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో.. తదనంతర పరిణామాలు ఎలా మారిపోతాయో తాజాగా ఒక వివాహితకు ఎదురైంది. భర్తే బ్లాక్ మెయిలర్ అవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరు సదాశివనగర్ లో గతేడాది నవంబరులో వివాహమైన ఒక జంట... హనీమూన్ ని విదేశాల్లో ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగా... థాయిలాండ్‌ ను ఎంపిక చేసుకుంది. అనంతరం ఇద్దరూ థాయిలాండ్ కు ప్రయాణమై వెళ్లారు. ఎన్నో ఆశలతో అద్భుతమైన సంసార జీవితానికి ఇది పునాధి అనుకుంటూ ఆ వివాహిత సంతోషంగా బయలుదేరి వెళ్లింది.

అయితే అక్కడ ఈమె ఒకటి తలిస్తే... అక్కడ మరొకటి జరిగింది. అక్కడ కొన్ని నీలి చిత్రాలు చూపించి, మద్యం తాగించి.. ఆ వివరాలన్నీ భర్త సెల్‌ ఫోన్లో రికార్డు చేసుకున్నాడట. ఈ విషయాలను బాధితురాలు వివరించారు. ఇందులో భాగంగా హనీమూన్ నుంచి తిరిగివచ్చిన తర్వాత తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియో తీసి, దాని చూపి బెదిరింపులకు దిగి, నగదు ఇవ్వాలని డిమాండు చేశాడట.

ఇలా బెంగళూరుకు తిరిగి వచ్చిన తర్వాత తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని.. ప్రతి నెలా వచ్చే శాలరీ మొత్తాన్ని తనకే ఇవ్వాలంటూ ఉద్యోగం చేస్తున్న ఆమెను బెదిరించడం ప్రారంభించాడట. తానుచెప్పినట్లు వినకపోతే వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడంట.

దీంతో అత్యంతా ఆగ్రహానికి లోనైన ఆ వివాహిత (28) బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం రేగింది. ఇదే సమయంలో పెళ్లికి ముందు తనకు సొంత నిర్మాణ సంస్థ ఉందని చెప్పిన తన భర్త.. నిజానికి నిరుద్యోగి అని వివాహాననంతరం గుర్తించినట్లు ఆమె పోలీసులకు వివరించారట.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారని సమాచారం.