కళ్లల్లో కారం కొట్టి, మెడమీద కాలు పెట్టి.. భర్తను కడతేర్చిన భార్య!
వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలో తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలూకాలోని కడశెట్టిహళ్లి గ్రామంలో ఓ వ్యక్తి (50) ఏళ్లు ఒక ఫామ్ హౌస్ లో ఇంటరిగా నివసిస్తున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 29 Jun 2025 9:30 AM ISTఇటీవల కాలంలో దాంపత్య జీవితంలో కలతలవల్ల, మూడో వ్యక్తి ఎంట్రీ వల్ల జరుగుతున్న నేరాలు, ఘోరాలు తీవ్ర ఆందోళనకరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేశంలో ఏదో ఒక మూల నుంచి వరుస సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మరో భార్య వ్యవహారం తెరపైకి వచ్చింది.
అవును... ప్రియుడితో కలిసి భర్తలను కడతేర్చుతున్న భార్యల వ్యవహరాలు ఇటీవల వరుసగా తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఓ మహిళ... తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన ఘటన మరొకటి తెరపైకి వచ్చింది. ఇందులో భర్త కళ్లల్లో ఆమె కారం పొడి కొట్టగా, ప్రియుడు అతడి మెడపై కాలు పెట్టి తొక్కినట్లు తెలుస్తోంది!
వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలో తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలూకాలోని కడశెట్టిహళ్లి గ్రామంలో ఓ వ్యక్తి (50) ఏళ్లు ఒక ఫామ్ హౌస్ లో ఇంటరిగా నివసిస్తున్నట్లు చెబుతున్నారు. అతని భార్య తిప్తూరులోని కల్పతరు బాలికల హాస్టల్ లో వంటమనిషిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు కరదలుసంటే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అంటున్నారు!
ఈ క్రమంలో... తమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన భార్య.. తన ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు చెబుతున్నారు. దీంతో.. జూన్ 24న తన భర్త ఉంటున్న చోటికి వెళ్లిన ఆమె... అతడి కళ్లల్లో కారం పొడి చల్లింది.. కర్రతో గట్టిగా తలపై కొట్టగా.. ఆమె ప్రియుడు, భర్త మెడపై పాదం పెట్టి నొక్కి చంపినట్లు చెబుతున్నారు!!
హత్య తర్వాత, ఆ ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి.. సుమారు 30 కి.మీ. దూరం తీసుకెళ్లారని.. తర్వాత తురువేకెరె తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో ఉన్న బావిలో మృతదేహాన్ని పడేశారని చెబుతున్నారు! విచారణలో భాగంగా ఆమె నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు!
