Begin typing your search above and press return to search.

భర్త ల్యాప్‌టాప్‌లో షాకింగ్ నిజం.. 8 ఏళ్ల సీక్రెట్.. 5 ఏళ్ల పెళ్లి బంధం బూడిద!

ఈ సీక్రెట్ ఎలా బయటపడింతో తెలిస్తే షాక్ అవుతారు. తన భర్త ల్యాప్‌టాప్ వాడుతుండగా వారి సీక్రెట్ బయటపడింది.

By:  Tupaki Desk   |   30 April 2025 6:30 AM IST
భర్త ల్యాప్‌టాప్‌లో షాకింగ్ నిజం.. 8 ఏళ్ల సీక్రెట్.. 5 ఏళ్ల పెళ్లి బంధం బూడిద!
X

ఏ బంధమైనా నమ్మకం అనే పునాది మీదనే నిలబడుతుంది. ఎక్కడ నమ్మకం సన్నగిల్లుతుందో.. అక్కడ బంధాలు కూడా త్వరగా తెగిపోతాయి. ఇలాంటి స్టోరీలు ఎన్నో చదివి, విని ఉంటారు. ఈ కోవలోనే భార్యను మోసం చేసిన భర్త గురించిన ఒక ఉదంతాన్ని తెలుసుకుందాం. ఈ కేసులో విడ్డూరం ఏమిటంటే ఆ మహిళను మోసం చేసింది ఆమె భర్త మాత్రమే కాదు.. తనకు బెస్ట్ ఫ్రెండ్ కూడా.

ఈ సీక్రెట్ ఎలా బయటపడింతో తెలిస్తే షాక్ అవుతారు. తన భర్త ల్యాప్‌టాప్ వాడుతుండగా వారి సీక్రెట్ బయటపడింది. అదే సమయంలో ఆమె స్నేహితురాలు పంపిన ఒక మెసేజ్ ఆమె కంటపడింది. అందులో ఉన్నది చదివిన వెంటనే ఆమె కంగుతిన్నది. దీంతో అప్పటి దాకా తనకే సొంతం అనుకున్న భర్తమీద తనకున్న నమ్మకం పూర్తిగా పోయింది. తన కథను ఫేస్‌బుక్‌లో పేర్కొనడంతో విషయం వైరల్ అయింది. ఆ మహిళ తన భర్త ద్రోహం గురించి చెప్పింది. ఇలాంటి విషయాలు పంచుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని పేర్కొంది. కొంతకాలంగా తన భర్త ప్రవర్తనపై అనుమానం కలుగుతోందని, అతను బాత్రూమ్ నుండి గ్యారేజ్ వరకు తన మొబైల్‌ను వెంట తీసుకెళ్లడం ప్రారంభించాడని పేర్కొంది.

మోసం ఎలా బయటపడింది?

అతను కొంచెం దూరం నీళ్లు తాగడానికి వెళ్లినా సరే తన ఫోన్‌ను వెంట తీసుకెళ్లేవాడు. మొదట్లో ఆమె తన ఆలోచనలు తప్పని అనుకుంది. అందుకే తాను అలా భావిస్తున్నానని, ఆ కారణంతోనే అతని ప్రవర్తనను గమనించడం మానేసింది. ఆ తర్వాత ఒకరోజు షాపింగ్ కోసం భర్త ల్యాప్‌టాప్ తీసుకుని విండో షాపింగ్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడే తన ఫ్రెండ్ మెసేజ్ చేసింది. అందులో "హుమ్మా రాత్రి అద్భుతంగా ఉంది, నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను" అని ఉంది. ఇది చదవగానే ఆ మహిళ కాళ్ల కింద భూమి కదిలిపోయింది.

ఆ తర్వాత వీళ్లిద్దరూ ఎనిమిది సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసని, తమ పెళ్లయి ఐదు సంవత్సరాలు అవుతోందని, కానీ ఈ విషయం గురించి వాళ్లు తనకు ఎప్పుడూ చెప్పలేదని ఆమెకు అర్థమైంది. అయితే దీని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో వాళ్ల మధ్య చాలా జరుగుతోందని ఈ సీక్రెట్ ను ఇద్దరూ తన నుండి దాచి పెట్టారని ఆమె గ్రహించింది. ఇంతకు ముందు తమ ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య ఏ సీక్రెట్లు లేవని ఆమె అనుకునేది, కానీ ఇంత పెద్ద రహస్యాన్ని ఇద్దరూ దాచి ఉంచడం చాలా బాధాకరమైన విషయం.