Begin typing your search above and press return to search.

లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నట్లు...?

ఈ టైం లో జనంలో ఉంటూ టీడీపీని ముందుకు తీసుకెళ్ళాల్సిన ఆయన తనయుడు, టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు అన్నదే కీలకమైన చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:02 AM GMT
లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నట్లు...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద బయటకు వచ్చేశారు. ఆయన ఈ నెల 28 వరకూ హాయిగా ఉండొచ్చు. ఈ లోగా రెగ్యులర్ బెయిల్ కనుక వచ్చేస్తే బే ఫికర్ గా ఉండొచ్చు. ప్రస్తుతం బాబు హైదరాబాద్ లో ఉంటున్నా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేరు, అలాగే రాజకీయ సభలలో కూడా ప్రసంగాలు చేయలేరు.

ఈ టైం లో జనంలో ఉంటూ టీడీపీని ముందుకు తీసుకెళ్ళాల్సిన ఆయన తనయుడు, టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు అన్నదే కీలకమైన చర్చగా ఉంది. నారా లోకేష్ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు.

నిజానికి చంద్రబాబు తో లోకేష్ ఉంటారని, ఆయన ఇచ్చే రాజకీయ సూచనలు తీసుకుంటారని, తద్వారా పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ జోరెత్తిస్తారని అంటున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి గుంటూరు జిల్లాలోని ఆయన నివాసం దాకా జరిగిన భారీ ర్యాలీ తప్పించి ఏపీలో టీడీపీ యాక్టివిటీ అయితే గత కొద్ది రోజులుగా లేదు

ఇక తెలంగాణాలో పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు దాంతో అక్కడ కూడా చడీ చప్పుడు లేదు. గత రెండు నెలలుగా చూస్తే టీడీపీ పెద్దగా రాజకీయ సందడి చేయకుండానే ఉంది. మరి బాబు బయటకు వచ్చిన తరువాత అయినా ఆయన పరోక్షంగా పార్టీ పరుగులు తీస్తుంది అనుకుంటే అదేమీ జరగడంలేదు.

నారా లోకేష్ వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు అని ప్రచారం సాగుతోంది. బాబు జైలులో ఉంటే న్యాయ నిపుణులతో లోకేష్ చర్చలు జరుపుతున్నారు అని అంటూ వచ్చే వారు. ఇపుడు అయితే అలాంటి పరిస్థితి లేదు. క్వాష్ పిటిషన్ మీద వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పు ని ఈ నెల 8న వెలువరిస్తారు. అందువల్ల ఆ విషయంలో అయితే లోకేష్ ఢిల్లీ వెళ్ళి చర్చలు జరుపుతున్నారు అనుకోవడానికి లేదు.

మరి లోకేష్ కి ఢిల్లీలో పని ఏముంది అన్నదే చర్చగా ఉంది. సరిగ్గా ఇక్కడ మరో రకమైన ప్రచారం సాగుతోంది. లోకేష్ ఢిల్లీలో రాజకీయ చర్చలకు తెర తీస్తున్నారు అని అంటున్నారు. తెలంగాణా ఎన్నికలను తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. టీడీపీ వ్యూహం అయితే కాంగ్రెస్ కచ్చితంగా గెలవాలి అని అంటున్నారు.

కాంగ్రెస్ గెలిస్తే ఇండియా కూటమిలోకి వెళ్ళేందుకు కూడా అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక లోకేష్ సైతం తాము ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించామని చెప్పడం ద్వారా ఇండియా కూటమి పెద్దలతో సాన్నిహిత్యం కోరుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. అదే విధంగా ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన ఇపుడు తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉంది. ఆ విధంగా కామన్ ఫ్రెండ్ గా పవన్ ఉన్నారు.

దాంతో జనసేనకు బీజేపీకి తమ ఓట్లు వేయిస్తామని చెప్పడం ద్వారా ఎన్డీయే కూటమి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని మరో ప్రచారం సాగుతోంది. అంటే ఇపుడు లోకేష్ చాలా పెద్ద పని మీదనే ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు. టీడీపీ దశ దిశను మలుపు తిప్పేదిగా భావించే తెలంగాణా ఎన్నికల్లో ఏ వైపు ఉంటే బెస్ట్, ఏ కూటమి ఆఫర్లు తమకు బెస్ట్ అన్నది లోకేష్ ఆలోచిస్తూ ఆ దిశగా ఢిల్లీ వేదికగా మాట్లాడాల్సిన పెద్దలతోనే మంతనాలు చేస్తున్నారు అని అంటున్నారు.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బాబు మళ్లీ జైలుకు వెళ్ళకూడదు, రాజకీయంగా ఈసారి సాధించాలన్నది సాధించాలని కూడా చూస్తున్నారని అంటున్నారు. అలాగే వచ్చే ఎన్నికల కోసం కూడా తగిన వ్యూహాలను కూటములకు ఎన్నుకునేందుకే బాబు డైరెక్షన్ లో చినబాబు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.