Begin typing your search above and press return to search.

భారతీయ నౌకలను ఎందుకు హైజాక్ చేస్తున్నారు?

హిందూ మహాసముద్రంలోని సోమాలియా తీరంలో మన నౌకను హైజాక్ చేశారు

By:  Tupaki Desk   |   5 Jan 2024 12:30 PM GMT
భారతీయ నౌకలను ఎందుకు హైజాక్ చేస్తున్నారు?
X

గతంలో విమానాల హైజాక్ లు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం నౌకల హైజాక్ లు చోటుచేసుకుంటున్నాయి. నాగరికత పెరిగిన తరువాత మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఎదుటి వారిని దోచుకోవడం ఓ అలవాటుగా చేసుకున్నారు. మన నౌకలను టార్గెట్ చేసుకుని హైజాక్ డ్రామాలు ఆడుతున్నారు. దీంతో ఇటీవల మన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మన నౌకలను హైజాక్ చేసే వారి అంతు చూస్తామని హెచ్చరించిన నేపథ్యంలో మరో నౌక హైజాక్ కు గురవడం సంచలనం కలిగిస్తోంది.

హిందూ మహాసముద్రంలోని సోమాలియా తీరంలో మన నౌకను హైజాక్ చేశారు. లైబీరియా జెండాతో ఉన్న నౌకలో 15మంది సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. ఘటన గురించి తెలిసిన తరువాత భారత నౌకాదళం స్పందించింది. హైజాక్ గురించి యూకే మారిటైమ్ ఏజెన్సీ సందేశం పంపించింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు అక్రమంగా నౌకలోకి ప్రవేశించారని తెలిసింది. దీనిపై భారత నౌకాదళం పరిశీలిస్తోంది. సముద్ర తీర గస్తీ కోసం ఐఎన్ఎస్ చెన్నై రంగంలోకి దిగింది.

నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్ కొనసాగుతోంది. వారు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో హిందూ మహా సముద్రంలో మన నౌకలను హైజాక్ చేయడం తరచుగా జరుగుతోంది. దీనిపై మన ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. నౌకలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని గతంలోనే రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు.

ఇజ్రాయెల్, హమాస్ దాడుల నేపథ్యంలో నౌకలను హైజాక్ చేస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. వారి దాడుల పరంపరలోనే భాగంగానే ఇలా మన నౌకలను లక్ష్యంగా చేసుకుని హైజాక్ లకు పాల్పడటంతో మనకు నష్టాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కొద్ది రోజుల క్రితం భారత్ కు వస్తున్న ఓ వాణిజ్య నౌకను గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరగడం తెలిసిందే.

విషయం తెలుసుకున్న మన నౌకాదళం కూడా ధీటుగానే స్పందించింది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం నుంచి 20 మంది భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చింది. ఇలా మన నౌకలను ఎంచుకుని మరీ హైజాక్ చేయడంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. ఇక మీదట నౌకల హైజాక్ కాకుండా చేయడానికే నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్, హమాస్ దాడుల సందర్భంగా వారు ఉగ్ర చర్యలకు తెగబడుతున్నారు. అందుకే మన నౌకలు వారికి తారసపడుతున్నాయనే వాదనలు వస్తున్నాయి. అందుకే మన నౌకలు హైజాక్ కు గురవుతున్నాయని తెలుస్తోంది.