Begin typing your search above and press return to search.

జనసేన సీట్లు పెంచేస్తున్న జోగయ్య... నాగబాబుకు అక్కడిచ్చారు!

ఇదే సమయంలో వీటిలో పవన్ పోటీచేసేందుకు ఏకంగా ఆరుసీట్లలో పరిశీలన జరుగుతుందని తెలిపారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 7:47 AM GMT
జనసేన సీట్లు పెంచేస్తున్న జోగయ్య... నాగబాబుకు అక్కడిచ్చారు!
X

రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి పోటీచేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తు వార్తలు మొదలైనప్పటినుంచీ సీట్ల పంపకాల విషయంలో రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో కనీసం 50 - 60 సీట్లకు తగ్గకుండా పోటీకి నిలబడాలని.. అదేవిధంగా సీఎం సీటును సైతం చెరో రెండున్నారేళ్లు చంద్రబాబు, పవన్ లు షేర్ చేసుకోవాలని హరిరామ జోగయ్య పలు డిమాండ్లు తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీట్ల విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... జనసేన విషయంలో ఎప్పుడు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారనే పేరున్న కాపు నేత, సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తనకున్న సమాచారం మేరకు జనసేన పార్టీ రాష్ట్రంలోని 57 సీట్లలో పోటీ చేసేందుకు పరిశీలిస్తోందని జోగయ్య చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో వీటిలో పవన్ పోటీచేసేందుకు ఏకంగా ఆరుసీట్లలో పరిశీలన జరుగుతుందని తెలిపారు.

గతకొన్ని రోజులుగా.. ప్రధానంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జనసేనకు టీడీపీ ఎన్నిసీట్లు కేటాయించబోతుందనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 21 స్థానాలని, కాదు.. కాదు.. 28 స్థానాలని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో సైతం 20ల్లోనే సీట్ల సంఖ్య వినిపిస్తుండటం తెలిసిందే. అయితే అదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేం లో భాగమని కొట్టిపారేసేవారూ లేకపోలేదు. ఈ సమయంలో జోగయ్య ఎంట్రీ ఇచ్చారు.

ఇందులో భాగంగా... రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన 57 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ 57 స్థానాల్లోనూ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే విషయంలో ఆరు స్థానాలపై చర్చ జరుగుతుందని అన్నారు. అందులో గాజువాక, పిఠాపురం, నరసాపురం, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం సీట్లు ఉన్నాయని అంటున్నారు.

ఈ ఆరు సీట్లతో పాటు గత ఎన్నికల్లో జనసేన నుంచి నరసాపురం లోక్ సభ స్థానానికి పోటీచేసిన కొణిదెల నాగబాబు ఈ సారి అసెంబ్లీకి పోటీచేస్తారని జోగయ్య చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా.. నాగబాబు పోటీ కోసం తిరుపతి అసెంబ్లీ సీటు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఇక మిగిలిన 50 స్థానాలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో...

పాయకరావుపేట

యలమంచిలి

అనకాపల్లి

పెందుర్తి

చోడవరం

భీమిలి

గాజువాక

విశాఖ ఉత్తరం

విశాఖ దక్షిణం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో...

పిఠాపురం

కాకినాడ సిటీ

కాకినాడ రూరల్

రాజమండ్రి రూరల్

రాజానగరం

ముమ్మిడివరం

అమలాపురం

రాజోలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో...

నర్సాపురం

భీమవరం

తాడేపల్లి గూడెం

తణుకు

నిడదవోలు

ఉండి

ఉంగుటూరు

ఏలూరు

పోలవరం

గోపాలపురం

కొవ్వూరు

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో...

మచిలీపట్నం

అవనిగడ్డ

నూజివీడు

పెడన

తెనాలి

గుంటూరు తూర్పు

గుంటూరు పశ్చిమ

పెదకూరపాడు

పొన్నూరు

ఇక మిగిలిన జిల్లాల విషయానికొస్తే...

ఒంగోలు

గిద్దలూరు

దర్శి

తిరుపతి

చిత్తూరు

మదనపల్లె

అనంతపురం

గుంతకల్లు

పుట్టపర్తి

నంద్యాల

కడప

కావలి

కోవూరు నియోజకవర్గాలు ఉన్నట్లు హరిరామజోగయ్య చెబుతున్నారు.