సూపర్ మ్యాన్ గా ట్రంప్.. వైట్ హౌస్ ను ఆడుకుంటున్న నెటిజన్లు!
అవును... సాధారణంగా ట్రంప్ కు సంబంధించిన కామిక్ ఫోటోలు, ఏఐ, ఎడిటెడ్ పిక్స్ సోషల్ మీడియాలో అటు అభిమానుల నుంచి, అటు వ్యతిరేకుల నుంచి వెలువడుతుండటం తెలిసిందే.
By: Tupaki Desk | 11 July 2025 3:19 PM ISTఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన వ్యక్తుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారని అంటారు! అందులో మంచిగా ఎంత, చెడుగా ఎంత అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇక ఇటీవల కలంలో సోషల్ మీడియాలో ట్రంప్ కు సంబంధించిన ఏఐ, ఎడిటెడ్ ఫోటోలు సంచలనంగా మారాయి! ఈ సమయంలో వైట్ హౌస్ నుంచి వచ్చిన ఓ ఫోటో మరింత వైరల్ గా మారింది.
అవును... సాధారణంగా ట్రంప్ కు సంబంధించిన కామిక్ ఫోటోలు, ఏఐ, ఎడిటెడ్ పిక్స్ సోషల్ మీడియాలో అటు అభిమానుల నుంచి, అటు వ్యతిరేకుల నుంచి వెలువడుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏకంగా వైట్ హౌస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఓ ఫోటో వెలువడింది. ఇందులో ట్రంప్ సూపర్ మ్యాన్ గా కనిపిస్తున్నారు. సూపర్ మ్యాన్ ఫోజులో కనిపిస్తున్న ఈ పోస్ట్ కు ది "సింబల్ ఆఫ్ హోప్" అనే క్యాప్షన్ పెట్టింది.
దీంతో పాటు.. "ట్రూత్.. జస్టిస్.. ది అమెరికన్ వే... సూపర్ మ్యాన్ ట్రంప్" అని రాసుకొచ్చింది. ఇలా స్వయంగా, ఏకంగా వైట్ హౌస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచే ఇలాంటి ఫోటో వెలువడటంతో ఇక నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ ఫోటోపై ట్రోలింగ్స్ పీక్స్ కి చేరుతున్నాయి. వైట్ హౌస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కామెంట్స్ సెక్షన్ లో దారుణమైన అభిప్రాయాలు దర్శనమిస్తున్నాయి.
ఇందులో భాగంగా.. "వైట్ హౌస్ కేవలం ఒక జోక్ లాగా మారే రోజు చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది" అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా... "అమెరికన్ చరిత్రలో ఇప్పుడున్న వైట్ హౌస్ అత్యంత ఇబ్బందికరమైన వైట్ హౌస్" అని మరొకరు వ్యాఖ్యనించారు. ఈ కామెంట్లతో పలువురు ఏకీభవిస్తూ స్పందించారు. ఏది ఏమైనా... ఈ పోస్ట్ తో వైట్ హౌస్ విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతుంది!
