Begin typing your search above and press return to search.

సోదరుడికి కిడ్నీ దానం చేసిన భార్య... చట్టవిరుద్ధమైన పనిచేసిన భర్త!

ఇందులో భాగంగా అన్నీ అనుకూలించడంతో కిడ్నీ దానం చేసింది. ఈ విషయాన్ని విదేశాల్లో ఉన్న భర్తకు చెప్పంది

By:  Tupaki Desk   |   22 Dec 2023 2:45 AM GMT
సోదరుడికి కిడ్నీ దానం చేసిన భార్య... చట్టవిరుద్ధమైన పనిచేసిన భర్త!
X

ప్రపంచం ఎంత ముందుకుపోతున్నా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు అలానే కొనసాగుతుంటుంటాయి! అయితే ఈ ప్రయాణంలో కొన్ని ఆచారాలు, సంప్రదయాలు, మతపరమైన వ్యవహారాలు చట్టపరిధిలోకి వచ్చిన తర్వాత మాత్రం కచ్చితంగా అందుకు అంతా లోబడి ఉండాల్సిందే. ఈ క్రమంలో తాజాగా భారత్ లో చట్టవిరుద్ధమైన పనికి పూనుకున్నాడు ఒక భర్త.. అందుకు భార్య చేసిన పని కిడ్నీ దానం చేయడం!

అవును... ఆపదలో ఉన్న తన సోదరుడ్ని ఎలాగైనా రక్షించుకోవాలన్న తపన తాపత్రయంలో కిడ్నీ దానం చేసిన మహిళకు ఆమె భర్త విడాకులు ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్య కిడ్నీ దానం చేసిన కారణంగా ఆమెకు విడుకులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది!

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర ప్రదేశ్ లోని బైరియాహి గ్రామంలో ఒక మహిళ తరన్నం నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఆమె భర్త రషీద్ ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. ఈ సమయంలో ఆమె సోదరుడు షాకీర్ కిడ్నీ వ్యాధితో భాదపడుతున్నాడు. ఈ సమయంలో తన సోదరుడ్ని ఎలాగైనా రక్షించుకోవాలన్న తాపత్రయంతో ఆమె ముందుకు వచ్చింది.

ఇందులో భాగంగా అన్నీ అనుకూలించడంతో కిడ్నీ దానం చేసింది. ఈ విషయాన్ని విదేశాల్లో ఉన్న భర్తకు చెప్పంది. దీంతో ఆమెకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. దీంతో ఆమె పోలీస్ లను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా... 2019లో దేశంలో ట్రిపుల్ తలాక్ ఆచారం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ పై నిషేధం విదిస్తున్నట్లు తెలిపింది. అయినప్పటికీ ఉల్లంఘిస్తే సుమారు మూడు ఏళ్ల వరకు జైలు శిక్షను విధిస్తారు.