Begin typing your search above and press return to search.

టీడీపీకి ఊపేదీ...ప్రాబ్లం ఏంటి...!?

అంటే 128 సీట్ల దాకా ప్రకటించారు. మరి ఇంత పెద్ద నంబర్ లో సీట్లు ప్రకటించిన తరువాత టీడీపీకి ఊపు ఎలా ఉండాలి. ఎక్కడ చూసినా జనాల్లో టీడీపీ జెండా ఎగరాలి.

By:  Tupaki Desk   |   16 March 2024 8:45 AM GMT
టీడీపీకి ఊపేదీ...ప్రాబ్లం ఏంటి...!?
X

తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే టికెట్లను ప్రకటించింది. పొత్తులలో 31 అసెంబ్లీ సీట్లను బీజేపీ జనసేనలకు ఇచ్చేసినా తనకు ఉన్న 144 అసెంబ్లీ సీట్లలో 16 తప్పించి తక్కినవి అన్నీ అభ్యర్ధులను ప్రకటించింది. అంటే 128 సీట్ల దాకా ప్రకటించారు. మరి ఇంత పెద్ద నంబర్ లో సీట్లు ప్రకటించిన తరువాత టీడీపీకి ఊపు ఎలా ఉండాలి. ఎక్కడ చూసినా జనాల్లో టీడీపీ జెండా ఎగరాలి. మొత్తం 128 సీట్లు అంటే మాటలు కాదు.

కానీ టీడీపీ ఎక్కడా పెద్దగా సౌండ్ చేయడం లేదు. గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళి చూస్తే జనం లోకి పోయి ప్రచారం చేస్తున్న అభ్యర్ధులు ఇరవై నియోజకవర్గాలకు లోపే అని అంటున్నారు. వారే తమ పార్టీ జెండాలతో తిరుగుతున్నారు. ఆ చోట్ల కూడా మిత్రపక్షాలు అయిన బీజేపీ జనసేన జెండాలు చాలా చోట్ల కనిపించడం లేదు.

ఇదీ ఇపుడు సాగుతున్న ప్రచారంగా ఉంది. మరి వంద సీట్లలో ఏమి జరుగుతోంది అంటే అక్కడ చాలా చోట్ల అభ్యర్ధులు సొంత పార్టీ నుంచే అసంతృప్తి ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. కొన్ని చోట్ల ఊహించని విధంగా వేరే వారికి టికెట్లు ఇవ్వడంతో సీనియర్లుగా ఉన్న వారు ఆశావహులు అంతా వారి ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు.

అభ్యర్ధులు అయితే నియోజకవర్గంలో పెద్ద తలకాయలకు ఫోన్ చేస్తున్నారుట. కానీ ఆ ఫోన్లకు అవతల వైపు నుంచి రిప్లై రావడం లేదు అని అంటున్నారు. దీంతోనే చాలా చోట్ల ఇంకా ప్రచారం మొదలు కాలేదని అంటున్నారు. బాలరిష్టాలు దాటి ప్రచారంలోకి అభ్యర్ధులు అడుగుపెట్టలేదని అంటున్నారు.

ఇక మూడు పార్టీలు రష్ట్ర స్థాయిలో జట్టు కట్టినా గ్రౌండ్ లెవెల్ లో ఆ సూచనలు అయితే కనిపించడంలేదు. బీజేపీకి జనసేనకు క్యాడర్ ఉన్న చోట్ల సీట్లు అడిగారు. కొన్ని ఇచ్చారు. రాని చోట్ల వారు మౌనన్ వహిస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్ధులు బలగ్నా ఉన్న చోట ప్రచారానికి మిత్రులు పెద్దగా ముందుకు రావడంలేదు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఈసారి టీడీపీ ప్రయోగమే చేసింది అని చెప్పాలి. సీనియర్లు బలవంతులు అనుకున్న చోట కొత్తవారిని బరిలోకి దింపింది. వారికి కచ్చితంగా పార్టీలోని సీనియర్ల సహకారం కావాలి. కానీ వారు అది అందించడంలేదు అని అంటున్నారు. చాలా చోట్ల ఇంకా అలకపాన్పు దిగని వారు ఉన్నారు.

మరి కొన్ని చోట్ల చివరి నిముషంలో అయినా తమ అభ్యర్థిత్వం ఖరారు అవుతాయన్న ఆశతో అభ్యర్ధులుగా ఖరారు చేసిన వారిని పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. దాంతో చాలా ముందు నుంచి టీడీపీ ప్రచారం చేపట్టేందుకు వీలుగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించామన్న టీడీపీ అధినాయకత్వం ఆశలు తీరేలా లేవు అని అంటున్నారు.

నిజానికి చూస్తే గత నెల 24న తొలి జాబితాగా మొత్తం 94 మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించారు. మరి ఇప్పటికే నెల దగ్గరకు వస్తున్నా వారిలో అనేక మంది ప్రచారం చేపట్టడంలేదు అని అంటున్నారు. ఎందుకు ఇంత నిర్లిప్తత అంటే టీడీపీలోనే ఒక గందరగోళ పరిస్థితి గ్రౌండ్ లెవెల్ లో చోటు చేసుకోవడమే అని అంటున్నారు. ఏది ఏమినా అధినాయకత్వం చాలా చోట్ల నచ్చ చెబుతోంది. అక్కడ సరే అంటూ వచ్చిన వారు కూడా నియోజకవర్గాలలో అభ్యర్ధులకు సహకరించడంలేదు అని అంటున్నారు.

మరి కొన్ని చోట్ల అసంతృప్తులు అధినాయకత్వం చెప్పినా అలాగే ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నామినేషన్లు తరువాత కానీ ఊపు అందుకోదేమో అని అంటున్నారు. అదే జరిగితే ముందు నుంచి అభ్యర్ధుల ప్రకటన ఎందుకు ఈ ప్రయోగం వల్ల వచ్చిన లాభం ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది.