Begin typing your search above and press return to search.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యూహం ఏంటో?

కేసీఆర్ విధానాలు, లక్ష్యాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పడం గమనార్హం.

By:  Tupaki Desk   |   18 March 2024 3:59 PM GMT
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యూహం ఏంటో?
X

బహుజన సమాజ్ పార్టీ అధ్యక్ష పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటిచారు. ఈ మేరకు కేసీఆర్ ఫాంహౌస్ లో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను కాదనుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు. కేసీఆర్ విధానాలు, లక్ష్యాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పడం గమనార్హం.

ఆర్ఎస్పీ లక్ష్యం ఏమిటి? బహుజన సమాజ్ పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో అందులో చేరినా తరువాత మనసు మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక దశలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కు బినామీ అనే వాదనలు అప్పట్లోనే వచ్చాయి. వాటికి అనుగుణంగానే ఆయన పార్టీ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లు చెబుతున్నారు.

ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన సేవలు రాష్ట్రానికి అవసరమున్నా ఎందుకో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు. సర్వీసు ఉన్నా రాజీనామా చేయడంతో గురుకులాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆయన సారథ్యంలో గురుకుల పాఠశాలలు బ్రహ్మాండమైన ఫలితాలు సాధించడం గమనార్హం. ఇక ఆయన తప్పుకోవడంతో గురుకులాల్లో మళ్లీ సమస్యలు నెలకొన్నాయి.

ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాగజ్ నగర్ నుంచి బరిలో నిలిచి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ లో చేరడం మరో కీలక పరిణామం. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని మరీ దానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం బీఆర్ఎస్ లో కూడా ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. ఇలా అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకోవడం వెనుక ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానాలు చాలా మందిలో వస్తున్నాయి. కేసీఆర్ వ్యూహమేంటి? ఆర్ఎస్ ను ఎందుకు చేర్చుకున్నారు. ఏం చేయబోతున్నారనే కోణంలో పలు ప్రశ్నలు అందరి మదులను తొలుస్తున్నాయి.