Begin typing your search above and press return to search.

నాడు హరికృష్ణ - నేడు ఎన్టీఆర్ చేసిన నేరమేమిటి?

అయితే... రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్‌ 4న ఆ పదవికి రాజీనామా చేశారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 12:40 PM GMT
నాడు హరికృష్ణ - నేడు ఎన్టీఆర్  చేసిన నేరమేమిటి?
X

నందమూరి హరికృష్ణ... ఈ పేరు చెప్పగానే ఎక్కువమంది కొనియాడేది తండ్రికి తగ్గ తనయుడు అని.. తండ్రిని దైవంగా భావించే వారని చెబుతుంటారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో చైతన్య రథం వాహనం టాప్ ఎక్కి చేతులు ఊపాలని కోరుకోలేదు.. తన తండ్రి ప్రయాణిస్తున్న రథానికి సారథిగా ఉండాలని భావించారు.. అనుకున్నట్లుగానే క్షేమంగా బాధ్యతను చక్కబెట్టారు.

అలా రాజకీయాల్లో తనతండ్రికి చేదోడు వాదోడుగా, నీడగా మెలిగిన మూడో కుమారుడు హరికృష్ణ... 1995 ఆగస్టు సంక్షోభం నేపథ్యంలో తన తండ్రి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు సీఎం పీఠాన్ని, పార్టీ పగ్గాలను లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ "అన్న టీడీపీ"ని స్ధాపించారు. అనంతరం జరిగిన ఎన్నో పరిణామల తర్వాత 2008లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే... రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్‌ 4న ఆ పదవికి రాజీనామా చేశారు.

పార్టీలో తనకు, తన కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన సన్నిహితుల ఎన్నో సార్లు హరికృష్ణ తన అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతుంటారు. ఈ క్రమంలోనే టీడీపీపి మహానాడులో పాల్గొనడం కన్నా, తన తండ్రి ఎన్టీఆర్‌ కు నివాళులు అర్పించడమే ముఖ్యమని గతంలో వ్యాఖ్యానించారు కూడా. ఆయన కుటుంబానికి పార్టీలో ప్రధాన్యత లేదనే విషయం హరికృష్ణ ఆనాడే గ్రహించారు!

రాజకీయాల్లో ఉన్నా ఏనాడు కుహనా రాజకీయనేతగా బండి నడిపించేయకుండా... తనదైన ముక్కుసూటి తత్వం, నిర్మొహమాటమైన అభిప్రాయాలతో పోలిటికల్ కెరీర్ కొనసాగించారు నందమూరి హరికృష్ణ. ఈ క్రమంలోనే ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా, అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఈ విషయంలో.. సీనియర్ ఎన్టీఆర్ తో పాటు అనంతరం హరికృష్ణను కూడా కొంతమంది కావాలనే మానసిక క్షోభకు గురిచేశారని చెబుతుంటారు.

ఆ రెండు తరాలు అయ్యాయి. ఇప్పుడు మూడో తరం జూనియర్ ఎన్టీఆర్ టైం నడుస్తుంది. అయినప్పటికీ ఆ “శాపం” ఈ కుటుంబాన్ని వదలలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నాడు హరికృష్ణను ఎలా మానసికంగా టార్చార్ చేశారో.. పార్టీలో ఒక సాధారణ సభ్యుడిగా నడవాల్సిన పరిస్థితి కల్పించారో.. దాదాపు అదే సూత్రాలు నేడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ చాలా పక్కాగా అమలుచేస్తున్నారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది.

ఇందులో భాగంగానే నిన్నమొన్నటివరకూ పార్టీ సభల్లోనూ, ఇప్పుడు ఏకంగా పెద్దాయన ఘాట్ వద్దా జూనియర్ విషయంలో కొంతమంది కుటుంబ సభ్యులు ప్రవర్తించిన తీరు అందుకు తాజా ఉదాహరణ అని అంటున్నారు. నడిచినవారెవరైనా, నడిపించింది మరెవరైనా.. ఆ శాపం రూపం ఏదైనా.. ఇబ్బంది పడింది మాత్రం జూనియర్ అని.. ఈ శాపం హరికృష్ణ కుటుంబాన్ని ఎప్పటికి వదులుతుందో అని పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.