Begin typing your search above and press return to search.

దేశం వదలొచ్చు... బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొంతమంది నేతలకు ఫ్యాషన్ అయిపోనట్లుగా కనిపిస్తుంది!

By:  Tupaki Desk   |   10 Sep 2023 11:45 AM GMT
దేశం వదలొచ్చు... బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
X

ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొంతమంది నేతలకు ఫ్యాషన్ అయిపోనట్లుగా కనిపిస్తుంది! అధికారం అశాస్వతం.. ఇది ప్రజాస్వామ్య దేశం అనే విషయం మరిచిపోతున్నట్లుగా కనిపిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరిగి ఏదైనా అంటే బోరుమంటున్నారని తెలుస్తుంది!

ఈ క్రమంలో "ఇండియా" పేరును "భారత్‌" గా మార్చనున్నారనే అంశంపై గత కొన్ని రోజులుగా దేశమంతటా తీవ్రంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంటులో బిల్లు పెడతారని కథనాలొస్తున్న తరుణంలో... ఇప్పటికే జీ-20 లో సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో ఇప్పటికే "భారత్" అనే పేరును ఉపయోగించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా దీనిపై పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేత దిలీప్ ఘోష్‌ స్పందించారు. "భారత్‌"గా పేరు మార్చటాన్ని తప్పుపడుతున్న వారిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పేరు మార్పును వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లవచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా ఏర్పాటు చేసిన "ఛాయ్‌ పే చర్చా" కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ నేత దిలీప్‌ కుమార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన కలకత్తాలో వలస వాదానికి ప్రతీకగా నిలిచిన విదేశీ విగ్రహాలన్నింటినీ తొలగిస్తాం అని చెప్పిన అనంతరం "భారత్‌" పేరు నచ్చని వారు దేశం వదిలి వెళ్లిపోవచ్చని అన్నారు.

దీంతో ఈ కామెంట్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యం అనే విషయం మరిచి ఒంటెద్దుపోకడలకు పోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇదే అంశంపై బీజేపీకి చెందిన మరో నాయకుడు రాహుల్‌ సిన్హా స్పందించారు. దేశానికి రెండు పేర్లు ఉండవని చెబుతూ.. ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరుగుతోన్న నేపథ్యంళో పేరు మార్చడానికి ఇదే సరైన సమయం అని అన్నారు.

కాగా, జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కు సంబంధించి "ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌" పేరుతో ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి. ఎప్పటి నుంచో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న "ఇండియా" పేరును కాదని" భారత్‌"గా పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించాయి.