Begin typing your search above and press return to search.

కిరికిరి లేదు.. క‌లిసిపోయారు: గోదావ‌రి నేత‌లంతే!

ఇప్పుడు టీడీపీ నేతల తీరు కూడా ఇలానే ఉంది. జిల్లాలో పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువులు తవ్వుతున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 4:00 PM IST
కిరికిరి లేదు.. క‌లిసిపోయారు:  గోదావ‌రి నేత‌లంతే!
X

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాలిటిక్స్ చాలా డిఫ‌రెంట్. క‌క్ష పూరిత రాజ‌కీయాలు.. కిరికిరి రాజ‌కీయాలు ఇక్క‌డి నాయ‌కుల‌కు తెలియ‌వు. అంతా స‌ర్దుకుపోవ‌డమే. ఇప్పుడు కూడా రాజ‌కీయాలను అలానే సాగిస్తున్నారు. గ‌తంలో వైసీపీ నేత‌లు ఇప్పుడు టీడీపీ నేత‌లు సేమ్ టు సేమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. జిల్లా ప‌రిధిలోని భీమ‌వ‌రంలో ఆక్వా, చేప‌ల చెరువుల‌కు ప్ర‌సిద్ధి. ఎవ‌రు అధికారంలో ఉంటే.. ఆ పార్టీ హ‌వా ఇక్క‌డ సాగుతుంది.

గ‌తంలో వైసీపీ నేత‌లు ఎక్క‌డ‌ప‌డితే అక్కడ చెరువు త‌వ్వేశారు. చివ‌ర‌కు జ‌నావాసాల‌ను కూడా ఆక్ర‌మించారు. అయితే.. అప్ప‌ట్లో దీనిని రాజ‌కీయం చేయాల్సిన టీడీపీ నాయ‌కులు వారితో స‌ర్దుకుపోయార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చివ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం, ఆవేద‌న రెండూ వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటివి వెలుగు చూశాయి. ఇక‌, ఇప్పుడు టీడీపీ నేతల తీరు కూడా ఇలానే ఉంది. జిల్లాలో పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువులు తవ్వుతున్నారు.

కొన్నిచోట్ల అసలు అనుమతి లేకుండా తవ్వేస్తున్నారు. వీటిపై ప్రత్య‌ర్థి పార్టీ వైసీపీ నాయ‌కులు మౌనంగా ఉంటారు. దీంతో స్థానిక ప్రజలు, రైతులు ఆందోళనకు దిగి రోడ్డెక్కిన సందర్భాలే క‌నిపిస్తున్నాయి.ఇక‌, అధికారులు కూడా ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి వ‌త్తాసు ప‌ల‌క‌డం ష‌రా మామూలే. మత్స్యశాఖలో కొందరు ఎఫ్‌డీవోలు, క్షేత్రస్థాయిలో వీఆర్వోలు నేత‌ల‌కు వంతపాడుతున్నారనేది ఇక్క‌డి టాక్‌ కాళ్ల,

పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల ఈ తరహా తవ్వకాలు జరుగుతున్నాయి. వాస్త‌వానికి ఆక్వా చెరువులు తవ్వాలంటే తగిన అనుమతులు పొందడంతో పాటు జలవనరులు, నివాసాలలకు నిర్ణీత దూరం పాటించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో ఇవేమీ అమలు కావడం లేదు. అయినా.. ఎవ‌రూ ఏమీ ప‌ట్టించుకోరు. అంతా క‌లిసి పోవ‌డ‌మే.. కిరికిరి లేని ప్ర‌త్యేక రాజ‌కీయాలు ఇక్క‌డ సాగుతాయి.