Begin typing your search above and press return to search.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన ?

ఇక ఉత్తర బెంగాల్ పరిసర ప్రాంతాలలో ఉన్న అనేక జిల్లాలలో కూడా పరిస్థితి అలాగే ఉంది.

By:  Tupaki Desk   |   15 April 2025 7:53 PM IST
పశ్చిమ  బెంగాల్ లో రాష్ట్రపతి పాలన ?
X

పశ్చిమ బెంగాల్ అట్టుడుతోంది. అనేక జిల్లాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఒక సామాజిక వర్గం వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇక కేంద్ర బలగాలను అక్కడ పెట్టాలని సూచనలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం బీఎస్ఎఫ్ జవాన్లను పంపించింది. అయినా కూడా బెంగాల్ లో మంటలు ఆరడం లేదు. ముర్షిదాబాద్ లో అల్లరులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ ఒక వర్గం వారు మరో వర్గం వారి ఇళ్ళ మీదకు దాడులు చేసి మరీ భయభ్రాంతులకు గురి చేశారని వారంతా తమ ఇళ్లను వదిలేసి పారిపోయారని కూడా చెబుతున్నారు.

ఇక ఉత్తర బెంగాల్ పరిసర ప్రాంతాలలో ఉన్న అనేక జిల్లాలలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇక చూస్తే కనుక ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాలు, నాడియా, మాల్దా, సౌత్ దినాజ్ పూర్, నార్త్ దినాజ్ పూర్ ప్రాంతాలలో అత్యధికంగా ఈ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

దీనికి కారణం బంగ్లా దేశ్ నుంచి గత కొన్ని ఏళ్ళుగా అక్రమంగా వచ్చిన తీవ్ర వాదులు వారి ముఠాలతో ఈ ప్రాంతాలలో ఎప్పుడూ ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇపుడు వక్ఫ్ చట్టం రూపంలో వీరంతా కలసి స్థానిక వర్గాలతో మమేకం అయి ఏకంగా తీవ్ర ఘర్షణలే సృష్టిస్తున్నారు అని అంటున్నారు.

కేంద్ర నిఘా వర్గాలు కూడా ఈ విషయం గుర్తించాయని చెబుతున్నారు. విదేశీ శక్తుల హస్తం బంగ్లా అల్లర్ల వెనక ఉందని కూడా వారు గమనించారు అని అంటున్నారు. మరి బీఎస్ఎఫ్ జవాన్లను సైతం పనిచేయకుండా అడ్డుకుంటూ అక్కడ తమ ఆధిపత్యం చూపిస్తున్న ఈ ఉగ్ర శక్తులకు వారికి ఆశ్రయం ఇస్తున్న వారికీ కనుక తగిన తీరున గుణపాఠం చెప్పాకపోతే అది జాతీయ భద్రతకే తీవ్రమైన విఘాతాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు.

అయితే కేంద్రం బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాన్ని పూర్తిగా గమనిస్తోంది అని అంటున్నారు. అయితే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఒక వర్గం నుంచి డిమాండ్ వస్తోంది. బీజేపీ బెంగాల్ శాఖ నాయకులు అయితే హిందువులకు ఏ మాత్రం రక్షణ లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం ఏమి ఆలోచిస్తోంది అన్నదే చర్చగా ఉంది. కేంద్రం కనుక సీరియస్ స్టెప్ దిశగా అడుగులు వేస్తుందా అని కూడా డిస్కషన్ సాగుతోంది. అయితే రాష్ట్రపతిపాలన విధిస్తే అది మమతా బెనర్జీకి పొలిటికల్ గా అడ్వాంటేజ్ అవుతుందా లేక ఇబ్బంది అవుతుందా అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది.

మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న వేళ పశ్చిమ బెంగాల్ లో చెలరేగుతున్న అల్లర్లు ఇపుడు పెను సవాల్ గా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లనే ఇదంతా అని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు పదే పదే విమర్శిస్తున్న నేపధ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం అవుతుందా అన్నదే హాట్ టాపిక్ గా ఉంది. అదే కనుక జరిగితే మమతా మాజీ సీఎం అవుతారు. మరి రాష్ట్రపతి పాలనలోనే ఎన్నికలు పెడితే అది బీజేపీకి రాజకీయ లాభమా అన్న కోణంలోనూ చర్చ సాగుతోందిట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.