Begin typing your search above and press return to search.

ఇరాన్ కు ఎందుకు సాయం చేయడంలేదో చెప్పిన పుతిన్.. ఇంట్రస్టింగ్ రీజన్!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - రష్యాలు ఒకరిపై ఒకరు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి.

By:  Tupaki Desk   |   23 Jun 2025 4:06 PM IST
ఇరాన్  కు ఎందుకు సాయం చేయడంలేదో చెప్పిన పుతిన్.. ఇంట్రస్టింగ్  రీజన్!
X

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - రష్యాలు ఒకరిపై ఒకరు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ లోకి ఆపరేషన్ మిడ్ నైట్ హార్మర్ అంటూ అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సమయంలో ఇరాన్ మిత్రదేశమైన రష్యా స్పందించింది.

అవును... ఇరాన్ పై శనివారం సాయంత్రం వరకూ ఇజ్రాయెల్ మాత్రమే దాడులు చేస్తుండగా.. ఆ తర్వాత బాంబులు, తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులతో అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ లోని అణుకేంద్రాలపై దాడులు చేసింది. 25 నిమిషాల్లో ఈ పని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇంత జరుగుతున్నా.. ఇరాన్ కు సుదీర్ఘకాలంగా మిత్రదేశమైన రష్యా ఎందుకు స్పందించడం లేదు?

ఈ ప్రశ్నకు తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ యుద్ధంలో తాము తటస్థంగా ఎందుకు ఉంటున్నామో వివరించారు. ఇందులో భాగంగా... రష్యన్‌ ఫెడరేషన్‌ కు చెందిన సుమారు 20లక్షల మంది ఇజ్రాయెల్‌ లో నివసిస్తున్నారని.. తమ దృష్టిలో ఇప్పుడది దాదాపు రష్యన్‌ మాట్లాడే దేశమే అని అన్నారు.

ఈ విషయాలను పరిగణలోకి తీసుకునే.. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతల్లో తాము తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నామని వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్ లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... మిత్ర దేశాలపై రష్యా నిజాయతీని కొంతమంది విమర్శిస్తున్నారని, వారంతా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారేనని పుతిన్‌ మండిపడ్డారు. వాస్తవానికి అరబ్‌ దేశాలతో తమకు సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందని.. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ లో రష్యా అబ్జర్వర్‌ గా ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని ఆయన ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మరోవైపు... అణ్వాయుధాల పేరు చెప్పి ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తోన్న వేళ స్పందించిన రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇరాన్ కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.