Begin typing your search above and press return to search.

పెళ్లిని క్యాన్సిల్ అయ్యేలా చేసిన మూలుగ బొక్క!

ఈ సందర్భంగా అబ్బాయి బంధువులు మూలుగు బొక్క కావాలని అడగటంతో ఇరు వర్గాల మధ్య గొడవైంది. అది కాస్తా చూస్తుండగానే పెద్దదైంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 5:53 AM GMT
పెళ్లిని క్యాన్సిల్ అయ్యేలా చేసిన మూలుగ బొక్క!
X

బలగం సినిమా గుర్తుంది కదా? అందులో మూలుగు బొక్క కోసం బావ.. బావమరదుల మధ్య జరిగే గొడవ గురించి తెలిసిందే. ఇలాంటి సీన్లు చూసినప్పుడు నిజజీవితంలో జరుగుతాయా? అన్న సందేహం కలుగుతుంది. కానీ.. కొన్ని ఘటనల్ని చూసినప్పుడు మాత్రం.. సినిమాకు మించినట్లుగా కొన్ని ఉదంతాలు కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఈ కోవలోకే చెందుతుంది.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన ఒక అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అయ్యింది. కట్నకానుకులు మాట్లాడుకున్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని అంశాలు మాట్లాడేసుకున్నారు. ముందుగా అనుకన్న ప్రకారం నవంబరు మొదటి వారంలో ఎంగేజ్ మెంట్ సందర్భంగా అమ్మాయి ఇంట్లో నాన్ వెజ్ భోజనాల్ని ఘనంగా ఏర్పాటుచేసుకున్నారు.

ఈ సందర్భంగా అబ్బాయి బంధువులు మూలుగు బొక్క కావాలని అడగటంతో ఇరు వర్గాల మధ్య గొడవైంది. అది కాస్తా చూస్తుండగానే పెద్దదైంది. ఇలా గొడవ అంతకంతకూ ఎక్కువై.. చివరకు కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో.. సీన్ పోలీస్ స్టేషన్ కు మారింది. మొత్తానికి విషయం రాజీకొచ్చినా.. పెళ్లి కూతురు తరఫు వారు మాత్రం పెళ్లి సంబంధం కలుపుకోవటం వద్దని చెబుతూ.. మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా బలగం మూవీ సీన్ ను గుర్తుకు తెచ్చుకోవటం గమనార్హం.