Begin typing your search above and press return to search.

పెళ్లి కాని ప్రసాదులకు శుభవార్త... ఆ సమయం రానే వచ్చింది!

అవును... వివాహాలు జరిపించేందుకు వేదపండితులు, పురోహితులు వేదక్యాలెండర్ ప్రకారం శుభ ముహుర్తాలు, అమృత ఘడియలు చూసి పెళ్లిళ్లకు తేదీలను ఖరారు చేస్తారు.

By:  Tupaki Desk   |   10 July 2025 8:32 PM IST
పెళ్లి కాని ప్రసాదులకు శుభవార్త... ఆ సమయం రానే వచ్చింది!
X

పెళ్లికాని ప్రసాదులకు, వివాహం కాని వనితలకు ఒక గుడ్ న్యూస్. ఇంతకాలం పెళ్లి పీటలు ఎక్కక, మిగిలిపోయిన వారికి ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు! ఎందుకంటే... ఎప్పుడెప్పుడు వివాహ శుభ గడియలు వస్తాయా అని ఎదురుచూస్తున్న వారికి ఆ సమయం దగ్గరగా వచ్చింది. ఇక పెళ్లి సందడికి ముహూర్తం దగ్గరపడింది. తప్పట్లు తాళాలు, మంగళ వాయిద్యాలకు వేళయ్యింది.

అవును... వివాహాలు జరిపించేందుకు వేదపండితులు, పురోహితులు వేదక్యాలెండర్ ప్రకారం శుభ ముహుర్తాలు, అమృత ఘడియలు చూసి పెళ్లిళ్లకు తేదీలను ఖరారు చేస్తారు. పెళ్లి తర్వాత జరగబోయే తతంగాలకూ శుభగడియలే నిర్ణయిస్తారు. ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నవారికి ఈ ప్రయత్నాలు అంతా మంచి చేస్తాయని భావిస్తారు.

ఈ క్రమంలో... మరో 15 రోజుల్లో శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. వేల కుటుంబాల్లోనూ, జీవితాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో త్వరలో కళ్యాణ మండపాలు, జ్యువెలరీ షాపులు, వస్త్ర దుకాణాలు సందడిగా మారనున్నాయి. ఆఫర్ల ప్రకటనలు వెలువడనున్నాయి.

ఇదే సమయంలో... వేల సంఖ్యలో జరగనున్న వివాహ శుభకార్యాల వల్ల సుమారు పాతిక వరకూ రంగాలకు చెందిన వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి దొరకనుంది. వేల కోట్ల రూపాయల లావాదేవీఉలు వాణిజ్యపరంగా సందడి చేయనున్నాయి. ఎంతో మందికి చేతి నిండా పని దొరకడంతో పాటు పల్లెలు, పట్టణాలు సందడిగా మారనున్నాయి.

వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ శుభముహూర్తాలు ఉండడం వల్ల ఎక్కువగా వివాహాలు జరగలేదని చెబుతున్నారు. మంచి గడియలు లేవన్న కారణంగా చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. అయితే ఇక ఆ సమస్య లేదని.. శుభముహూర్తాలు జులై 26 నుంచి ప్రారంభమై నవంబర్ 27 వరకు కొనసాగనున్నట్లు వేదపండితులు చెబుతున్నారు.

కాగా... గత ఏడాది కేవలం నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు సుమారుగా దేశంలో 48 లక్షల వివాహాలు జరగగా.. ఈ పెళ్లిళ్ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఇది 2023లో జరిగిన వ్యాపారంతో పోలిస్తే 41 శాతం పెరుగుదలని చూపిస్తోందని చెబుతున్నారు. ఈ లెక్కన ఈసారి ఆ 'లెక్క' వేరే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.