Begin typing your search above and press return to search.

పెళ్లి గిఫ్ట్ అంటే ఇలా ఉండాలి.. చూస్తేనే భయపడాలి..ఇప్పుడిదే ట్రెండ్ !

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో వరుడి స్నేహితులు పెళ్లికొడుకు, పెళ్లి కూతురులకు ఇచ్చిన బహుమతి చూసి పెళ్లికి వచ్చిన అతిథులు షాక్‌కు గురయ్యారు.

By:  Tupaki Desk   |   22 April 2025 11:54 AM IST
పెళ్లి గిఫ్ట్ అంటే ఇలా ఉండాలి.. చూస్తేనే భయపడాలి..ఇప్పుడిదే ట్రెండ్ !
X

ఒక పెళ్లి వేడుక ఆనందంతో నిండిపోవాల్సింది పోయి.. ఒక్కసారిగా అంతా స్టన్ అయి భయాందోళనకు గురయ్యారు. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఇచ్చిన ఒక వింత బహుమతి పెళ్లికి వచ్చిన వారందరినీ షాక్‌కు గురిచేసింది. ఇంతకు ఆ బహుమతి ఏమిటా అని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ?

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో వరుడి స్నేహితులు పెళ్లికొడుకు, పెళ్లి కూతురులకు ఇచ్చిన బహుమతి చూసి పెళ్లికి వచ్చిన అతిథులు షాక్‌కు గురయ్యారు. ఆ బహుమతి అంత వింతగా ఉండటమే కాకుండా, ఒక భయానకమైన ఘటనను గుర్తుకు తెచ్చేలా ఉండడంతో అక్కడ అంతా కాసేపు భయానక వాతావరణం నెలకొంది.

పెళ్లి వేడుక జరుగుతుండగా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఒక పెద్ద బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్‌ను మోసుకుంటూ వేదికపైకి వచ్చారు. కొందరు నవ్వుతూ ఫోటోలు తీస్తుండగా, చాలా మంది మాత్రం ఇబ్బందిగా కనిపించారు. పెళ్లికూతురు ఆశ్చర్యంతో నవ్వినా, పెళ్లికొడుకు మాత్రం కాస్త కలవరపడుతూ కనిపించాడు.

ఈ పెళ్లి మంగ్రౌల్ గ్రామానికి చెందిన శైలేంద్ర రాజ్‌పుత్‌కు, రిహుంట గ్రామానికి చెందిన సీమకు జరిగింది. రథ్ పట్టణంలోని ఒక మ్యారేజ్ గార్డెన్‌లో జరిగిన ఈ వేడుకలో పెళ్లికొడుకు బాజా భజంత్రీలతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం నుంచి పూల దండలు మార్చుకోవడం వరకు సాధారణంగానే జరిగాయి. కానీ వరుడి ఫ్రెండ్ డ్రమ్ ను గిఫ్టుగా ఇచ్చిన దగ్గర్నుంచి పెళ్లి వాతావరణం మారిపోయింది.

కొందరికి అది ప్రాంక్‌లా అనిపించినా, ఆ బ్లూ కలర్ డ్రమ్ సింబాలిజం మాత్రం ఏమాత్రం ఫన్నీగా లేదు. చూస్తున్న వారంతా వెంటనే మీరట్‌లో జరిగిన ఒక భయంకరమైన హత్య కేసును గుర్తు చేసుకున్నారు. ఆ కేసులో ఓ వ్యక్తి భార్య, ఆమె ప్రియుడు కలిసి అతడిని చంపి ఇలాంటి బ్లూ కలర్ డ్రమ్ లోనే బాడీని కుక్కినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి భయంకరమైన ఘటనను కొత్త జీవితానికి నాంది పలికే పెళ్లి వేడుకలో గుర్తు చేయడం చాలా మందికి బాధాకరంగా అనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.