Begin typing your search above and press return to search.

ఆ యుద్ధంతో భారత్ మీద అంత వాణిజ్య ప్రభావం పడనుంది?

ఈ రెండు దేశాల మధ్య రత్నాలు.. అభరణాల వాణిజ్యం ఒక్కటే 2.8 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:30 AM GMT
ఆ యుద్ధంతో భారత్ మీద అంత వాణిజ్య ప్రభావం పడనుంది?
X

ఇప్పుడున్న సమస్యలు సరిపోనట్లుగా.. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ - హమస్ మధ్య నెలకొన్న యుద్ధం ప్రపంచం మీద ప్రభావాన్ని చూపుతోంది. మరి.. మన దేశం మీద.. ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాల మీద చూపే ఎఫెక్టు ఎంత? దీని వల్ల జరిగే బిజినెస్ లాస్ ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజా యుద్దంతో భారత్ - ఇజ్రాయెల్ మధ్య జరిగే వ్యాపారంలో ముఖ్యంగా రత్నాలు.. ఆభరణాల వ్యాపారం మీద ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

ఈ రెండు దేశాల మధ్య రత్నాలు.. అభరణాల వాణిజ్యం ఒక్కటే 2.8 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. భారత్ - ఇజ్రాయెల్ మధ్య మొత్తం వాణిజ్య విలువ దగ్గర దగ్గర 12 బిలియన్ డాలర్లుగా చెప్పొచ్చు. మన రూపాయిల్లో చెప్పాలంటే ఇంచుమించు రూ.10వేల కోట్లకు దగ్గరగా ఉంటుందని చెప్పాలి. భారత్ నుంచి ఇజ్రాయెల్ కు కట్.. పాలిష్డ్ వజ్రాలు ఎగుమతి అవుతుంటాయి.

ఇజ్రాయెల్ నుంచి భారత్ కు ప్రధానంగా రఫ్ వజ్రాల దిగుమతి సాగుతుంటుంది. ఇజ్రాయెల్ తో జరిగే వాణిజ్యంలో భారత్ నుంచి ఇజ్రాయెల్ కు ఎక్కువగా ఎగుమతులు జరుగుతుంటాయి. అక్కడి నుంచి దిగుమతులు తక్కువ. అంటే.. విదేశీ మారకద్రవ్యం ఇజ్రాయెల్ వాణిజ్యం కారణంగా ఎక్కువగా లభిస్తుంది. గణాంకాల్లో చెప్పాలంటే.. భారత్ నుంచి ఇజ్రాయెల్ కు ఏటా 8.4 బిలియన్ డాలర్లు జరిగితే.. ఆ దేశం నుంచి భారత్ కు జరిగే దిగుమతులు 2.3 బిలియన్ డాలర్లు మాత్రమేనని చెబుతారు. అంటే.. ఏడాదికి ఇజ్రాయెల్ తో వాణిజ్యంలో భారత్ కు 6.1 బిలియన్ డాలర్ల మిగులు ఉంటుందన్న మాట.

ఇజ్రాయెల్ కు భారత్ నుంచి కట్.. పాలిష్డ్ వజ్రాలు.. డీజిల్ ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి భారత్ కు రఫ్ డైమండ్స్.. కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలతో పాటు ఎలక్ట్రానిక్స్.. టెలికం పరికరాలు.. పొటాషియమ్ క్లోరైడ్.. హెర్బిసైడ్ లు ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎర్ర సముద్రంలో ఉన్న ఈలాట్ నౌకాశ్రయం ద్వారా జరుగుతుంది. యుద్ధం దీర్ఘకాలం సాగితే భారత్ పైన ప్రభావాన్ని చూపుతుందని.. ఆభరణాల మార్కెట్ ఒడిదుడికులకు లోనవుతుందని చెబుతున్నారు.