Begin typing your search above and press return to search.

ఒకే చోట 165 మంది బాలికల సమాధులకు సర్వం సిద్ధం.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం!

ఇరాన్ నుంచి వస్తున్న కొన్ని దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగడం లేదు. ఒకే ఒక్క వైమానిక దాడి వందలాది కుటుంబాల్లో చీకటి నింపింది.

By:  Madhu Reddy   |   3 March 2026 4:57 PM IST
ఒకే చోట 165 మంది బాలికల సమాధులకు సర్వం సిద్ధం.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం!
X

ఇరాన్ నుంచి వస్తున్న కొన్ని దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగడం లేదు. ఒకే ఒక్క వైమానిక దాడి వందలాది కుటుంబాల్లో చీకటి నింపింది. ఇరాన్‌లోని మినాబ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 165 మంది అభం శుభం తెలియని ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి వరకు స్కూల్ బ్యాగులతో,తోటి స్నేహితులతో సందడి చేసిన ఆ చిన్నారుల కోసం ఇప్పుడు ఒకే చోట వరుసగా సమాధులు సిద్ధమయ్యాయి. ప్రపంచాన్నే కదిలించిన ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి..

ఒకే వరుసలో చిన్నారుల సమాధులు.. గుండె పగిలే దృశ్యం:

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం చిన్నారుల పాలిట శాపంగా మారింది. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల ధాటికి ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో మొత్తం 180 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 165 మంది కేవలం చిన్నారి బాలికలే ఉండటం అత్యంత విషాదకరం. ఇక వారందరినీ ఒకే చోట అంతిమ సంస్కారాలు చేయడానికి ఇరాన్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం వరుసగా తవ్విన గోతుల ఫోటోలను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేయగా, అవి చూసిన ప్రతి ఒక్కరి హృదయం బాధతో కన్నీటి పర్యంతం అవుతోంది.

అంతిమ యాత్రలో కన్నీటి సంద్రమైన ఇరాన్:

ఈ చిన్నారుల అంతిమ యాత్రలో ఇరాన్ ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఒకరా, ఇద్దరా,180 మంది తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. వారి ఫోటోలతో, ప్రకాడ్స్ తో జనసంద్రంగా అంతిమ యాత్ర సాగింది.ఇక స్కూల్ సమీపంలోనే ఐఆర్జీసీ సెంటర్ ఉండటమే ఈ భారీ ప్రాణనష్టానికి కారణమని తెలుస్తోంది. దానిని లక్ష్యంగా చేసుకున్న కేంద్రానికి పక్కనే స్కూల్ ఉండటంతో, బాంబుల దాడిలో పిల్లలు బలయ్యారు. వారు ఎప్పుడు ఉహించి వుండరు స్కూల్ లో ఇలా మరణిస్తాము అని, హాయిగా ఆటపాటలతో గడపాల్సిన వయసులో, ఇలా యుద్ధ తంత్రానికి బలి కావడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధానికి బలైపోతున్న పసి ప్రాణాలు:

రెండు దేశాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో సంబంధం లేని సామాన్యులు, ముఖ్యంగా అభం శుభం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం. ఇరాన్ విడుదల చేసిన ఆ ఫోటోలలో ఆ చిన్నారుల కోసం తవ్విన సమాధులు చూస్తుంటే యుద్ధం ఎంతటి వినాశనాన్ని మిగిలిస్తుందో అర్థమవుతోంది. విజ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన పాఠశాలలు ఇప్పుడు స్మశానవాటికలుగా మారిపోతున్నాయి. ఈ సంఘటన తర్వాత ఇరాన్ దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఈ రక్తపాతాన్ని ఆపాలని మానవతావాదులు కోరుకుంటున్నారు.