విడదల రజనీ హంగామా.. ఏం చేశారంటే!
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ మరోసారి హంగామా సృష్టించారు.
By: Tupaki Desk | 20 April 2025 8:54 AMవైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ మరోసారి హంగామా సృష్టించారు. వక్ఫ్ సవరణ చట్టం -2025కు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొ న్నారు. వాస్తవానికి ముస్లింలు.. అందునా పురుషులు మాత్రమే ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కానీ, మాజీ మం త్రి రజనీ ఈ ర్యాలీలో పాల్గొని హంగామా సృష్టించారు. వక్ఫ్ చట్టం ముస్లింలకు అన్యాయం చేస్తోందని వ్యాఖ్యానించారు. అయితే.. కొందరు ముస్లింలు ఆమె రాకను వ్యతిరేకించారు.
మాజీ మంత్రి రజనీ వెళ్లిపోవాలని యువ నాయకులు సహా పలువురు ముస్లింలు కోరారు. అయినప్పటికీ.. ఆమె తగుదునమ్మా.. అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో మధ్యలోనే విడదల రజనీనివారు అడ్డంగించారు. వెనక్కి వెళ్లిపోవాలని.. ఏదైనా దాడులు జరిగే అవకాశం ఉందని అభ్యర్థించారు. అయినప్పటికీ.. రజనీ ఎవరి మాటా వినకపోగా.. పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. కేసులు పెట్టుకుంటే ఎన్నయినా పెట్టుకోండి. అని వ్యాఖ్యానించారు.
అప్పటికీ సీఐ పలుమార్లు ఆమెకు చెప్పి చూశారు. కానీ, రజనీ ఎవరి మాటా లెక్కచేయలేదు. దీంతో ము స్లిం వర్గాలు.. రెండుగా చీలిపోయి.. ఒకవర్గం రజనీతో వెళ్లగా.. మరో వర్గం వేరుగా ర్యాలీ నిర్వహించాయి. దీనికితోడు.. వక్ఫ్ వ్యతిరేక ర్యాలీల పేరుతో అసాంఘిక శక్తులు విజృంభించే అవకాశం ఉందన్న సమా చారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సదరు ర్యాలీలలో పోలీసులు నిఘా పెట్టారు. ఇంత జరుగుతున్నా..పోలీసుల మాట లెక్కచేయకుండా రజనీ వ్యవహరించడంపట్ల విమర్శలు వస్తున్నాయి.