వైసీపీ లీడర్లకు పులుసై పోయినా.. "పవర్" తగ్గలేదే ..!
ఒకరకంగా చెప్పాలంటే వైసీపీకి భారీ పరాజయం వచ్చి చేరింది. దీంతో నాయకులు ఏం చేయాలి? తమను తాము నిలబెట్టుకునేందుకు.. పోయిన ప్రాభవం తిరిగి పొందేందుకు ప్రయత్నించాలి.
By: Tupaki Desk | 6 April 2025 10:10 AM ISTగత ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఎంత ఘోరంగా దెబ్బతిందో అందరికీ తెలిసిందే. మహా మహులు అనదగిన నాయకులు కూడా కూటమి సునామీలో కొట్టుకుపోయారు. ఎక్కడా బలమైన నాయకులు మిగులుతారని అనుకున్నా.. అక్క డకూడా.. పరాభవం తప్పలేదు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీకి భారీ పరాజయం వచ్చి చేరింది. దీంతో నాయకులు ఏం చేయాలి? తమను తాము నిలబెట్టుకునేందుకు.. పోయిన ప్రాభవం తిరిగి పొందేందుకు ప్రయత్నించాలి.
కానీ, పవర్ పోయినా.. నాయకులు తమ తీరుమార్చుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎ న్నికల్లో ప్రజల చేతిలో పులుసై పోయినా.. పవర్ మాత్రం తగ్గలేదన్న కామెంట్లు కూడా వెల్లువలా దూసుకు వస్తున్నాయి. నియోజకవర్గాలలో చాలా మంది వైసీపీ నాయకులు అప్రకటిత ఎమ్మెల్యేల మాదిరిగా వ్యవ హరిస్తున్నారన్న వార్తలు తరచుగా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి కూడా. కడప జిల్లాలో మాజీ ఎమ్మె ల్యే, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు.
తన అనుచరుడు.. ఒకరు మహిళల నుంచి సొమ్ములు అప్పుగా తీసుకున్నారు. వాటిని తీర్చమని అడిగి నందుకు సదరు మహిళలపై దాడి చేశారని.. వారు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే.. మహిళలు మొత్తంగా సదరు వ్యక్తిని పట్టుకుని.. స్టేషన్‌లో అప్పగించారు. ఇంతలో విషయం తెలుసుకున్న అంజాద్ బాషా.. నే రుగా స్టేషన్‌కు వెళ్లి.. పోలీసులకు మాట మాత్రంగా కూడా చెప్పకుండానే తన అనుచరుడిని విడిపించు కుని వెళ్లిపోయారని మహిళలు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కూడా మౌనంగానే ఉండిపోయారట.
ఇక, రెండు రోజుల కిందట.. వైసీపీ ఎమ్మెల్సీ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ ఏకంగా.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారిపైనే విరుచుకుపడ్డారు. `నాయాల` అంటూ దూషణలకు దిగారు. దీనికి ముందు.. మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ వంటివారు కూడా.. పోలీసులపై దూషణలకు దిగారని వార్తలు వచ్చాయి. ఇలా.. వైసీపీలో పవర్ పోయినా.. ఇప్పటికీ.. నాయకులు అదే తరహాలో చలామణి అవుతుం డడం గమనార్హం. దీనివల్ల వారికి ప్రత్యేకంగా వచ్చే లబ్ధి ఏమీ లేకపోయినా.. పోయేది మాత్రం చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
