Begin typing your search above and press return to search.

ఓటు ఎవరికి వేశానో చెప్పేసిన వీటీవీ గణేష్.. మరీ ఇంత టాలెంటా బాబూ!

దీంతో ఆయన ప్రకటన సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఆయన ఫేమస్ డైలాగ్ నే కామెంటు చేస్తున్న నెటిజన్లు ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’ అంటూ పోస్టులు రాస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   23 April 2026 6:56 PM IST
ఓటు ఎవరికి వేశానో చెప్పేసిన వీటీవీ గణేష్.. మరీ ఇంత టాలెంటా బాబూ!
X

‘‘ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’’ అన్న పాపులర్ డైలాగ్ తో బాగా ఫేమస్ అయిన తమిళ హస్యనటుడు వీటీవీ గణేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమిళనాడు ఎన్నికల సందర్భంగా చెన్నైలో ఓటు వేసిన గణేష్ పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి తాను ఎవరికి ఓటు వేసింది చెప్పేశారు. సమాజాన్ని, ప్రజలను, వ్యవస్థను ఉన్నతీకరించడానికి దళపతి విజయ్ సరైన వ్యక్తి అంటూ అభివర్ణించిన వీటీవీ గణేష్ తాను టీవీకే పార్టీకి ఓటు వేసినట్లు బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఆయన ప్రకటన సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఆయన ఫేమస్ డైలాగ్ నే కామెంటు చేస్తున్న నెటిజన్లు ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’ అంటూ పోస్టులు రాస్తున్నారు.

ఇక టీవీకే గణేష్ ఇలా బహిరంగంగా ప్రకటన చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రహస్యంగా ఉంచాల్సిన ఓటును బహిర్గతం చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలింగ్ స్టేషన్ వెలుపలకు వచ్చిన తర్వాత చేసిన ప్రకటన ఎన్నికల నిబంధనలను అతిక్రమించడం కిందకు రాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సెలబ్రెటీలు పోలింగ్ రోజున ఇలాంటి ప్రకటన చేయడం వల్ల ఓటరును ప్రభావితం చేయడమే అవుతోందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు.

కాక రేపిన హీరో అజిత్ కామెంట్స్

సాధారణంగా సెలబ్రిటీలు "ఓటు మన హక్కు, అందరూ వేయండి" అని చెబుతారు కానీ, ఏ పార్టీకి వేశారో చెప్పడానికి సంకోచిస్తారు. గణేష్ మాత్రం ఏమాత్రం తడబడకుండా చెప్పడం విశేషంగా అభివర్ణిస్తున్నారు. హస్యనటుడిగా గణేష్ తన సినిమాల్లో ఎంతో గంభీరమైన గొంతుతో హాస్యం పండిస్తారు. ఇక నిజ జీవితంలో కూడా అంతే గంభీరంగా తన ఓటు ఎవరికో చెప్పేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని అంటున్నారు. ఇక మరో నటుడు అజిత్ సైతం ఓటు వేసిన అనంతరం ‘మార్పు అవసరం లేదు’ అన్నట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం కావడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించారు. ‘‘ఆయన చెప్పింది సరైందే’’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు.

సినీ రంగానికి చెందిన వీటీవీ గణేష్, హీరో అజిత్ చేసిన కామెంట్లు తమిళ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. గణేష్ ఇండస్ట్రీకి చెందిన దళపతి విజయ్ కి మద్దతుగా నిలిస్తే, హీరో అజిత్ మాత్రం ప్రస్తుతానికి రాష్ట్రంలో పాలన మారాల్సిన అవసరం లేదన్నట్లు సంకేతాలిచ్చారని అంటున్నారు. అయితే ఈ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని అజిత్ మేనేజర్ ఖండించారు. తమ హీరో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. మొత్తానికి తమిళనాడు పోలింగ్ సందర్భంగా సెలబ్రెటీల కామెంట్లు ప్రత్యేక చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో 234 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.