ఇప్పుడంతా.. ప్రజా రాజకీయమే.. ప్రోగ్రెస్‌లు తప్పవ్..!
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయింది. దీంతో నాయకులు ఎవరి ప్రోగ్రెస్ కార్డును వారు సరిచూసుకునే పరిస్థితి ఏర్పడింది.
By: Tupaki Desk | 12 Jun 2025 2:00 PM ISTరాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయింది. దీంతో నాయకులు ఎవరి ప్రోగ్రెస్ కార్డును వారు సరిచూసుకునే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు నాయకులు కొలతలు వేసుకుంటున్నారు. దీనికి కారణం.. బలమైన ప్రజల ఓటు బ్యాంకు స్థిరంగా లేకపోవడమే. ఒకప్పుడు ఏం చేసినా చెల్లేది. కానీ, ఇప్పుడు ఓటరు నాడి.. ఓటు స్థాయి కూడా ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది చెప్పడం కష్టంగా మారింది.
దీనిని దృష్టిలో పెట్టుకునే ఏడాదికాలంలోనే నాయకులు తమ ప్రోగ్రెస్ కార్డులను రూపొందించుకుంటు న్నారు. ప్రజలు అమాయకులని సహజంగా రాజకీయ నాయకులు భావిస్తారు. కానీ, కాదని గత ఎన్నికలు స్పష్టం చేశాయి. అంతేకాదు.. వారు చాలా తెలివైన వారని కూడా స్పష్టమైంది.దీంతో గతంలో మాదిరిగా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఏదో ఎన్నికలకు ముందు ఆరు మాసాలు ప్రజల్లో ఉంటే సరిపోతుంద న్న ధోరణి ఇప్పుడు ఎవరిలోనూ కనిపించడం లేదు.
అంతేకాదు.. మనం ఏం చేసినా అడిగేవారు లేరన్న ధోరణి అధికార పార్టీలోను.. మనం ఎన్నికలకు ముందు ప్రజలను కలుద్దామన్న ధోరణి ప్రతిపక్ష నాయకుల్లోను తగ్గిపోతోంది. దీనికి కారణం..ప్రజల్లో చైతన్యం పెరుగుతుండడమే. దీనిని ఒడిసి పట్టుకున్న నాయకుడు, పార్టీనే విజయం దక్కించుకుంటున్న హిస్టరీ గత ఎన్నికలే కాదు.. 2019లోనూ మనకు కనిపించింది. ఈ మార్పు మంచిదే. అయితే.. అందరూ అలానే ఉన్నారా? అంటే.. లేరనే చెప్పాలి.
ఈ విషయంలో టీడీపీ పరిస్థితి బాగుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో కేవలం మూడు నెలల కాలంలోనే ఓడినా ప్రజల ముందుకు వచ్చారు. సోషల్ మీడియా విస్తృతంగా ఉన్నప్పటికీ.. ప్రజల మధ్యకు వస్తే తప్ప.. ప్రజల్లో ఉంటే తప్ప.. అనే ధోరణిలో టీడీపీ ముందుకు సాగింది. ఈ క్రమంలోనే బాదుడే బాదడు.. సహా యువగళం వంటి ప్రజాహిత కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. ఇలా.. ప్రజల నాడిని ఎప్పటి కప్పుడు పట్టుకున్న పార్టీలే.. గెలుస్తున్నాయి. తప్ప.. సోషల్ మీడియాను నమ్ముకున్న పార్టీలు ఎక్కడా గెలుస్తున్న దాఖలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
