స్టీల్ ప్లాంట్ లో ఘోరకలి...ఉడికిన మానవ దేహాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో కనీ వినీ ఎరగని దారుణమైన ఘోర ప్రమాదం సంభవించింది.
By: Satya P | 9 Jun 2026 1:45 AM ISTవిశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో కనీ వినీ ఎరగని దారుణమైన ఘోర ప్రమాదం సంభవించింది. ఇది ఊహకు అందనిది అత్యంత భయంకరమైనదిగా ఉంది. సాయంత్రం సరిగ్గా నాలుగుంపావు ప్రాంతంలో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఏకంగా తొమ్మిది మంది దుర్మరణం పాలు అయ్యారు. 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడితో ఉన్న ఉక్కు ద్రవం మోసుకుని వస్తున్న బకెట్లు ల్యాడిల్ లూజ్ అయి నేల మీదకు పడిపోవడంలో ఆ కిందనే పనిచేస్తున్న 15 మంది కార్మికులు కాలిపోయారు. ఇందులో ఏకంగా 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారిని విశాఖలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. స్టీల్ ప్లాంట్ లో చూస్తే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అని అంటున్నారు.
ముఖాలు సైతం అలా :
స్టీల్ ప్లాంట్ లోని హాట్ దామెటల్ విభాగంలో జరిగిన ఈ ప్రమాదం అత్యంత ఘోరమైనదిగా చెబుతున్నారు. ముఖాలు సైతం గుర్తు పట్టలేనంతగా ఉడికిపోయాయి. నిజానికి ఆ ప్రమాద ప్రాంతంలో ఎవరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు. ఉక్కు ద్రవాలను తీసుకుని వస్తున్న బక్కెట్లు ఒక్కసారిగా లూజ్ అయి పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు. ఉక్కు ద్రవం వేడి చూస్తే 1500 డిగ్రీల సెల్సియస్ లో ఉంటుందంటేనే ప్రమాదం తీవ్రతను ఎవరైనా ఇట్టే ఊహించుకోవచ్చు అని అంటున్నారు.
భద్రతా లోపమా :
ఇదిలా ఉంటే ఈ ప్రమాదం గురించి పూర్తి విచారణకు ఆదేశిస్తే తప్ప వివరాలు ఏవీ తెలిసి రావు. ప్రమాదం ఎలా జరిగింది అనన్ దానికి కూడా పూర్తి సమాచారం రావాలంటే సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ ప్రమాదానికి భద్రతాపరమైన లోపాలు కారణమా లేక సాంకేతిక లోపాలా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఇక అత్యంత ఉష్ణోగ్రతల మధ్య ఉక్కుని ద్రవీకరించిన తరువాత ఆ బకెట్లను ల్యాడిల్ కు అనుసంధానిస్తారు వాటి సాయంతో బకెట్లను పైకి తీసుకుని వెళ్తారు. మరి ల్యాడిల్ ఎందుకు లూజ్ అయి ఊడింది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ విషయంలో ఉదాశీనత నిర్లక్ష్యం ఉందా ఉంటే ఎవరిది అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మొత్తం 15 మందికి పైగా కార్మికులు ఆ సమయంలో స్పాట్ లో ఉన్నారని అంటున్నారు. అందులో పది మంది దాకా కాంట్రాక్టు కార్మికులు అయితే మరో అయిదారుగురు పర్మనెంట్ కార్మికులు అని చెబుతున్నారు. హాట్ మెటల్ విభాగంలో పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహరం అని అంటున్నారు. పూర్తి స్థాయిలో భద్రతాపరమైన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
తీవ్ర దిగ్భ్రాంతి :
ఇంత పెద్ద ప్రమాదం స్టీల్ ప్లాంట్ లో జరగడంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఘోర కలి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూనే సహాయం చర్యలను ముమ్మరం చేశారు. ఇంతటి భారీ ప్రమాదం జరగడం ఇదే మొదటి సారి కావడంతో స్టీల్ ప్లాంట్ సమీప ప్రాంతాలలో సైతం ఒక్కసారిగా కలకలం రేగి అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
