విశాఖ పాలిటిక్స్: అభ్యర్థి రెడీ.. కానీ, ఎన్నిక వాయిదా!
విశాఖపట్నం రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇక్కడి గ్రేటర్ విశాఖ పట్నం మునిసిపల్ కార్పొరేషన్‌ను కొన్ని రోజుల కిందట కూటమి పార్టీలు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 19 May 2025 2:02 PM ISTవిశాఖపట్నం రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇక్కడి గ్రేటర్ విశాఖ పట్నం మునిసిపల్ కార్పొరేషన్‌ను కొన్ని రోజుల కిందట కూటమి పార్టీలు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. ఇక, తాజాగా డిప్యూటీ మేయర్ ఎన్నికకు శ్రీకారం చుట్టారు. దీనిని కూటమి మిత్రపక్షం జనసేన దక్కించుకుంది.
అంతేకాదు.. జనసేన తరఫున సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రలో పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్ పర్యటనలను దగ్గరుండి పర్యవేక్షించిన దల్లి గోవింద్‌కు డిప్యూటీ మేయర్ పీఠాన్ని ఇవ్వాలని అనుకున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధినేత సీల్డ్ కవర్‌లో గోవింద్ పేరును ఒక్కదాన్ని ఈ సీటుకు సూచించా రు. దీంతో సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తవుతుందని అందరూ భావించారు.
ఈ అంచనాలతోనే కౌన్సిల్‌ను కూడా కొలువు దీర్చారు. అయితే.. అనూహ్యంగా రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి. టీడీపీ మద్దతు దారులుగా ఉన్న వైసీపీ సభ్యులు కొందరు గైర్హాజరయ్యారు. కారణాలు తెలియదు. దీంతో డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా గోవింద్‌ను ఎన్నుకునే ప్రక్రియ వాయిదా పడింది. అయితే.. ఈ వ్యవహారంపై జనసేనలోనూ చర్చ సాగుతోంది.
పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించి న గోవింద్‌కు డిప్యూటీ మేయర్ పీఠాన్ని ఇచ్చేందు కు పార్టీ కార్పొరేటర్లు ఇష్టపడలేదని ప్రచారం జరుగుతోంది. ఆయన కన్నా సీనియర్లు ఉన్నారని.. వారిని కాదని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్న జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి జనసేన లోకి వచ్చిన నాయకులు సహా.. ఇతర నేతలు కూడా ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. దీంతో కోరం లేక వాయిదా పడింది.
