Begin typing your search above and press return to search.

తదుపరి యూఎస్ ఉపాధ్యక్షుడు భారతీయ అమెరికన్?

మరోసారి భారత మూలాలు ఉన్న అమెరికన్ ఆ దేశ ఉపాధ్యక్ష స్థానంలో విధులు చేపట్టనున్నారా? అంటే అవుననే చెప్పాలి.

By:  Tupaki Desk   |   22 Feb 2024 7:30 AM GMT
తదుపరి యూఎస్ ఉపాధ్యక్షుడు భారతీయ అమెరికన్?
X

మరోసారి భారత మూలాలు ఉన్న అమెరికన్ ఆ దేశ ఉపాధ్యక్ష స్థానంలో విధులు చేపట్టనున్నారా? అంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే బైడెన్ ప్రభుత్వంలోనూ ఉపాధ్యక్ష పదవిని భారత మూలాలున్న కమలా హారీస్ విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ప్రభుత్వంలోనూ మరోసారి భారత మూలాలు ఉన్న ప్రముఖుడు అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష రేసులో మిగిలిన వారి కంటే ముందు ఉండటం తెలిసిందే.

ఆయన తన టీంను ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యక్ష పదవికి తనతో పోటీ పడిన భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామిని ఎంపిక చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అధ్యక్ష పదవి కోసం తనతో పోటీ పడుతున్న మరో భారతీయ అమెరికన్ కమ్ పొలిషియన్ గా పేరున్న నిక్కీ హేలీ పేరును ట్రంప్ ప్రస్తావించలేదు. తాజాగా ఆయన ఒక టీవీ కార్యక్రమంలో ఆరుగురు పేర్లనుప్రస్తావించారు. అందులో వివేక్ రామస్వామి పేరు కూడా ఉండి.

వివేక్ రామస్వామితో పాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్.. సౌత్ కరోలినా సెనెటర్ టిమ్ స్కాట్.. హవాయికి చెందిన మాజీ ఎంపీ తులసీగబ్బర్డ్.. ఫ్లోరిడా ఎంపీ బైరన్ డోనాల్డ్స్.. దక్షిణ డకోటా రాష్ట్ర గవర్నర్ క్రిస్టీ నోయెమ్ లు ఉన్నారు. ట్రంప్ పేర్కొన్న జాబితాలో వివేక్ రామస్వామి కనుక ఉపాధ్యక్షుడి బాధ్యతలు చేపడితే మాత్రం.. అదో రికార్డుగా చెబుతున్నారు. వరుసగా రెండు ప్రభుత్వాల్లోనూ భారత మూలాలు ఉన్న వ్యక్తికి అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించినట్లు అవుతుందని చెప్పాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసారి ట్రంప్ అధ్యక్ష పదవిని చేజ్కించుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. తాజా అధికార పక్షమైన డెమొక్రటిక్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవటం.. రెండోసారి అమెరికాకు అధ్యక్షుడ్ని కావాలన్న మొండితనంతో ఉన్న ట్రంప్.. అందుకు తగ్గట్లే ప్రయత్నాలు చేస్తుండటం.. అధ్యక్ష రేసులో ఆయన ముందు ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎంపిక చేసుకున్న ఆరుగురిలో ఎవరు ఉపాధ్యక్ష పదవి రేసులో షార్ట్ లిస్టు అవుతారో చూడాలి.