Begin typing your search above and press return to search.

వివేక్‌ రామస్వామి ఇంట్లో "నానీ" జాబ్‌.. జీతం తెలిస్తే షాక్!

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడి అభ్యర్థిత్వం రేసులో కొనసాగుతోన్న వివేక్‌ రామస్వామికి ఒక అవసరం వచ్చి పడిందట

By:  Tupaki Desk   |   4 Oct 2023 5:08 AM GMT
వివేక్‌ రామస్వామి ఇంట్లో నానీ జాబ్‌.. జీతం తెలిస్తే షాక్!
X

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడి అభ్యర్థిత్వం రేసులో కొనసాగుతోన్న వివేక్‌ రామస్వామికి ఒక అవసరం వచ్చి పడిందట. ఇందులో భాగంగా... భారతీయ సంతతికి చెందిన ఈ వ్యాపారవేత్త, బిలియనీర్ వివేక్ రామస్వామి తన పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. ఈ జాబ్ కోసం భారీగా జీతాన్ని ఆఫర్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా వారం పనిచేస్తే మరోవారం సెలవు!

అవును... రిక్రూట్‌మెంట్ స్టాఫింగ్ వెబ్‌ సైట్‌ లోని జాబ్ లిస్టింగ్ ప్రకారం వివేక్ రామస్వామి తన పిల్లల్ని చూసుకునే నానీ (ఆయా) కోసం వెదుకుతున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఎస్టేట్‌ జాబ్స్‌.కాం అనే పోర్టల్‌ లో ఒక ప్రకటన వచ్చింది. "ఇది ఒక హై ప్రొఫైల్‌ ఫ్యామిలీలో చేరడానికి ఒక అసాధారణమైన అవకాశం, ప్రత్యేకమైన కుటుంబ సావాసాలలో పాల్గొంటూ వారి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడాలి" అని యాడ్ పోస్ట్ అయ్యింది.

ఇందులో క్లైంట్‌ ఎవరనే విషయాన్ని అందులో పేర్కొనక పోయినప్పటికీ.. మీడియా సంస్థలు మాత్రం అది రామస్వామి కుటుంబం ప్రకటనే అని స్పష్టీకరిస్తున్నాయి. ఇది రామస్వామి కుటుంబానికి సంబంధించిందనే అనేమాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ జాబ్ కి ఎంపికైతే... వారు వారంలో 84 నుంచి 96 గంటలు పనిచేయాలి.

ఇదే సమయంలో ఒక వారం పనిచేస్తే తదుపరి వారం మొత్తం సెలవు ఉంటుంది. ఇంట్లోని చెఫ్‌, ఇతర నానీలు, హౌస్‌ కీపర్‌, ప్రైవేటు సెక్యూరిటీ వంటి తదితర సిబ్బందిని కో ఆర్డినేట్ చేసుకుంటూ పనిచేసుకుపోవాలి. అదేవిధంగా... ముఖ్యంగా చిన్నారులకు క్యూరేటర్లుగా వ్యవహరిస్తూ వారిని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి.

ఇదే సమయంలో అబ్బాయిల ఆటలు, బొమ్మలు, దుస్తులను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక, వివేక్‌ రామస్వామి.. భారత సంతతికి చెందిన అపూర్వను వివాహం చేసుకున్నారు. వివేక్‌ రామస్వామి అపూర్వ తివారీకి దంపతులకు కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు.

కాగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో వివేక్‌ రామస్వామి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలతో వివేక్‌ రామస్వామి చాలా మంది దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు, వివేక్‌ రామస్వామి ట్రంప్‌ వారసుడంటూ ఒకానొక సమయంలో టైం మ్యాగజైన్‌ కూడా సంబోధించిన సంగతి తెలిసిందే.