Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ కే కాదు మరో ప్రముఖ నేతకు అప్పిచ్చిన వివేక్

ఇదిలా ఉంటే.. చెన్నూరు నుంచి పోటీ చేస్తున్న వివేక్ తాను సమర్పించిన అఫిడవిట్ ను చూసినప్పుడు మరోఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:29 AM GMT
సీఎం కేసీఆర్ కే కాదు మరో ప్రముఖ నేతకు అప్పిచ్చిన వివేక్
X

అరవై ఎకరాల అసామికి డబ్బుల అవసరం ఉండదా? అంటే చెప్పలేం. ఒక టీవీ చానల్ లో భాగస్వామి.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి అప్పు అవసరం ఉంటుందా? అంటే కాస్తంత సందేహమే. కానీ.. అలాంటి డౌట్లు అక్కర్లేదని.. ముఖ్యమంత్రి అయితే మాత్రం అప్పుఅవసరం ఉండదా? అన్న విషయాన్ని తన అఫిడవిట్ లో చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను దాఖలు చేసిన అఫిడవిట్ లో తాను తీసుకున్న రుణం గురించి వెల్లడించారు. మాజీ ఎంపీ రాజగోపాల్ నుంచి రూ.1.06 కోట్ల మొత్తాన్ని అప్పగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. చెన్నూరు నుంచి పోటీ చేస్తున్న వివేక్ తాను సమర్పించిన అఫిడవిట్ ను చూసినప్పుడు మరోఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

వివేక్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అప్పు తీసుకున్న వైనం బయటకు వచ్చింది. వివేక్ నుంచి కోమటిరెడ్డి రూ.1.5కోట్లు అప్పు తీసుకున్న విషయం అందులో వెల్లడైంది. వివేక్ వెంకటస్వామి ఆస్తుల విలువ రూ.606.67 కోట్లు కాగా.. అందులో చరాస్తుల వాటా రూ.380.76 కోట్లు.. స్థిరాస్తుల వాటా రూ.225.91 కోట్లు.

వివేక్ కు ఆయన సతీమణికి కలిపి ఉన్న అప్పు రూ.45.44 కోట్లుగా తేలింది. ఇదంతా చూస్తే..వివేక్ ఏ పార్టీలో ఉన్నా.. పార్టీలకు.. రాజకీయ ప్రత్యర్థిత్వంతో సంబంధం లేకుండా నేతలకు అప్పులు ఇవ్వటంలో ముందుంటారన్న భావన కలుగక మానదు. ఏమైనా.. అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా చెప్పే కేసీఆర్ కు సైతం అప్పు ఇవ్వటం చూస్తే.. వివేక్ వెంకటస్వామి సామర్థ్యం ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు.